Home
News

Airtel Outage దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ సేవల్లో అంతరాయం.. పూర్తి వివరాలు..!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ లో (Airtel Outage) అంతరాయం ఏర్పడింది. మొబైల్‌ డేటా, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల్లో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక మంది యూజర్లు అవస్థలు పడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదులు, పోస్టులు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

డౌన్‌డిటెక్టర్‌ ప్రకారం మొత్తం ఎయిర్‌టెల్‌ యూజర్లతో 46 శాతం మొత్తం బ్లాక్‌అవుట్‌ ను ఎదుర్కొన్నారని తెలిపింది. మరియు 32 శాతం మందికి సిగ్నల్‌, 22 శాతం మందికి మొబైల్‌ కనెక్టివిటీతో సమస్యలు ఎదురయ్యాయని ఈ వెబ్‌సైట్‌ స్టేటస్‌ ట్రాకింగ్‌ టూల్‌ తెలిపింది. దీనిపై వేల సంఖ్యలో యూజర్లు రిపోర్టు చేసినట్లు తెలిపింది.

Airtel outage reported most of the states in india

దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే గుజరాత్‌ లో ఎక్కువ మంది యూజర్లు ఎయిర్‌టె‌ల్‌ సర్వీసుల్లో అంతరాయం కారణంగా అవస్థలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఎయిర్‌టెల్ ఇండియా ఈ సమస్యపై స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలిపింది.

మధ్యాహ్నం 2.22 PM గంటలకు సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఎంత మందికి సర్వీస్‌ ను పునరుద్ధరించారో వెల్లడించలేదు. దీంతోపాటు సమస్యకు కారణం ఎంటనే వివరాలను కూడా ఎయిర్‌టెల్ వెల్లడించలేదు. ప్రస్తుతం దేశంలో రెండో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఎయిర్‌టెల్‌ ఉంది.

ఇటీవల అక్టోబర్‌ నెల యూజర్ల వివరాలను టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) వెల్లడించింది. జులైలో రీఛార్జ్‌ ప్లాన్‌ల ధరల పెంచిన అనంతరం తొలిసారిగా అక్టోబర్ నెలలో ఎయిర్‌టెల్‌ 19.20 లక్షల యూజర్లను సంపాదించుకుంది. సెప్టెంబర్‌ నెలలో 14.35 లక్షలు, ఆగస్టులో 24 లక్షలు, జులై నెలలో సుమారు 17 లక్షల మంది యూజర్లను ఎయిర్‌టెల్ కోల్పోయింది.

ఎయిర్‌టెల్‌ తోపాటు IRCTC (ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) ఈ - టికెట్‌ సేవల్లోనూ అంతరాయం తలెత్తింది. యాప్‌, వెబ్‌సైట్‌ లు పనిచేయలేదు. తత్కాల్‌ బుకింగ్ సమయంలో IRCTC పనిచేయలేదని అనేక మంది సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

అయితే ఈ సమస్య పై సంస్థ స్పందించింది. మెయింటెనెన్స్‌ కారణంగా ఇబ్బందులు తలెత్తాయని ప్రకటన చేసింది. అత్యవసర సేవల కోసం ఫోన్‌ నంబర్‌ లు, మెయిల్‌ ఐడీని తన IRCTC వెబ్‌సైట్‌ లో ప్రచురించింది. అయితే కొంత సమయానికి IRCTC ఈ - టికెట్‌ సేవలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటి వరకు రైల్వేలో వివిధ సేవల కోసం వివిధ రకాల యాప్‌ లు, వెబ్‌సైట్‌ లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటిని ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సూపర్‌ యాప్‌ను రైల్వే విడుదల చేయనుంది. టికెట్‌ బుకింగ్‌, ట్రైయిన్‌ ట్రాకింగ్‌, ప్లాట్‌ఫాం, అన్‌రిజర్వడ్‌ టికెట్‌ బుకింగ్‌, ఫిర్యాదులను ఈ సూపర్‌ యాప్‌ నుంచే చేసేందుకు వీలుంటుంది. ఈ నెలలోనే ఈ యాప్‌ను లాంచ్‌ చేయనున్నారని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel outage reported most of the states in india users reports on social media
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X