Airtel Payments అన్ని సర్వీసులు ఇప్పుడు వాట్సాప్ లో కూడా చేయవచ్చు..

|

భారతదేశంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ మీద ఆధారపడుతున్నారు. ఆన్‌లైన్ పేమెంట్స్ విధానంలో విజయవంతమైన బ్యాంకులలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ బ్యాంకింగ్ సేవలు నేరుగా వాట్సాప్ లోని వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయడం ఇబ్బందిగా ఉంటే కనుక ఇక చింతించవలసిన అవసరం లేకుండా మీరు నేరుగా వాట్సాప్ ద్వారా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ యొక్క ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను పూర్తి చేయవచ్చు. అయితే దీనిని ప్రారంభించడానికి '8800688006' నెంబర్ సేవ్ చేసి 'హాయ్' అని టెక్స్ట్ మెసేజ్ చేయాలి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Airtel Payments Bank All Services is Now on WhatsApp: Here are Full Details

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో వాట్సాప్ UPI బ్యాంకింగ్ ఫీచర్లు

వాట్సాప్‌తో ఎయిర్‌టెల్ పేమెంట్స్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ యొక్క ప్రశంస ఫీచర్లలో మొదటిది సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీస్ మీకు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ ద్వారా 24/7 బ్యాంకింగ్‌ను వినియోగించవచ్చు అని కంపెనీ వాగ్దానం చేస్తుంది. అలాగే అదనంగా మరింత సురక్షితంగా ఉంచడానికి ప్రతిదీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడింది.

Airtel Payments Bank All Services is Now on WhatsApp: Here are Full Details

** బ్యాంకింగ్ సేవలు, గిఫ్ట్ కార్డ్‌లు మరియు బంగారం కొనడం, ఫాస్ట్‌ట్యాగ్ సేవలు, లోన్‌లు, రీఛార్జ్‌లు మరియు ఆన్‌లైన్ బిల్ పేమెంట్స్ వంటివాటిని మీరు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో వాట్సాప్ ద్వారా చేయవచ్చు.

** మీ అకౌంట్ సమాచారం ఎవరితోనూ షేర్ చేయబడదు. అంతేకాకుండా మీరు వాట్సాప్ లో పిన్ వంటి రహస్య సమాచారాన్ని కూడా నమోదు చేయవలసిన అవసరం లేదు.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో అన్ని రకాల ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను చేయడానికి వాట్సాప్‌ను ఉపయోగించుకోవడం కోసం కస్టమర్‌లకు ఎటువంటి ఛార్జీలు విధించబడవు. మీరు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ కానప్పటికీ కూడా దీనికి సంబందించిన సమాచారం కోసం లేదా ఏవైనా సందేహాలకు సమాధానాలు పొందడానికి వాట్సాప్ చాట్‌బాట్‌ని ఉపయోగించడానికి కంపెనీ వీలును కల్పిస్తుంది. మీరు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క చట్టబద్ధమైన బిజినెస్ అకౌంటుతో చాట్ చేస్తున్నట్లు గుర్తించడానికి ప్రొఫైల్‌లో చాట్ గ్రీన్ కలర్ గుర్తుతో ధృవీకరించబడుతుంది.

Airtel Payments Bank All Services is Now on WhatsApp: Here are Full Details

మీరు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి వాట్సాప్‌లో అన్ని రకాల నోటిఫికేషన్లు మరియు అలర్ట్‌లను స్వీకరించడం ఆపివేయాలనుకుంటే కనుక కేవలం 'స్టాప్' అని టైప్ చేసి చాట్‌లో పంపితే చాలు. మీరు అన్‌సబ్‌స్క్రైబ్ చేసి మళ్లీ విలువైన ఏదైనా సమాచారం పొందాలనుకుంటే కనుక మీరు తిరిగి పైన పేర్కొన్న నంబర్‌కు మళ్లీ 'హాయ్' అని మెసేజ్ పంపవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel Payments Bank All Services is Now on WhatsApp: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X