ఎయిర్‌టెల్‌కు భారీ షాకిచ్చిన ఆర్‌బిఐ

|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌కు గట్టి షాక్ తగిలింది. ఈ కంపెనీకి చెందిన ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఇకపై కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి వీలు లేదని ఆర్‌బీఐ తెలిపింది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కొత్త ఖాతాదారుల రిజిస్ట్రేషన్లను ఆపివేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. దీనికి ప్రధాన కారణం ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని తెలుస్తోంది. మార్చిలోనే ఈ సంస్థ 5 కోట్ల రూపాయల మేర భారీ జరిమానా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

 

పాస్‌పోర్టు కష్టాలకు చెక్,నో వెరిఫికేషన్,మొబైల్ ద్వారానే అంతా..పాస్‌పోర్టు కష్టాలకు చెక్,నో వెరిఫికేషన్,మొబైల్ ద్వారానే అంతా..

కంపెనీపై దర్యాప్తు

కంపెనీపై దర్యాప్తు

ఈ ఉల్లంఘనపై ప్రస్తుతం కంపెనీపై దర్యాప్తు చేస్తున్నందున రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్‌ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.

జనవరి 5, 2018 నుంచి..

జనవరి 5, 2018 నుంచి..

ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం జనవరి 5, 2018 నుంచి కొత్త కస్టమర్లను తీసుకోవట్లేదు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను మేం అధికారులకు అందజేశాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని ఎయిర్‌టెల్‌ ప్రతినిధి తెలిపారు.

ఎలాంటి అనుమతి తీసుకోకుండానే

ఎలాంటి అనుమతి తీసుకోకుండానే

ఖాతాదారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ వారి ఖాతాలు ప్రారంభించించింది. గత ఏడాది నవంబరు 20-22 తేదీల మధ్య ఆర్‌బీఐ నిర్వహించిన పరిశీలనలో ఈ విషయం తేలింది.

30 లక్షల ఖాతాలు
 

30 లక్షల ఖాతాలు

ఇలా దాదాపు 30 లక్షల ఖాతాలు తెరిచింది. ఆధార్‌తో నెంబర్‌ వెరిఫికేషన్‌ చేపట్టిన కస్టమర్లపై ఈ ప్రభావం పడింది. కేవలం ఖాతాలు తెరవడమే కాకుండా.. వంటగ్యాస్‌పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ లబ్ధిదారుల రెగ్యులర్‌ బ్యాంక్‌ ఖాతాల్లో కాకుండా తన పేమెంట్స్‌ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుంది.

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు

దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో, జనవరి 15న ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

ఖాతాదారుల అనుమతి లేకుండా

ఖాతాదారుల అనుమతి లేకుండా

కేంద్ర బ్యాంకు సూచించిన మార్గదర్శకాలు పాటించకుండా.. ఖాతాదారుల అనుమతి లేకుండా ఎందుకు ఖాతాలు తెరిచారో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.

 రూ.5 కోట్ల జరిమానా

రూ.5 కోట్ల జరిమానా

బ్యాంకు ఇచ్చిన సమాధానం విన్న తరవాత రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఈ ఉల్లంఘన మీద కంపెనీపై దర్యాప్తు చేపడుతోంది.

Best Mobiles in India

English summary
Airtel Payments Bank can’t get new customers more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X