ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ క్యాష్ విత్‌డ్రా లావాదేవీలలో సరికొత్త రికార్డు...

|

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (AePS) ప్లాట్‌ఫామ్ ఆధారంగా FY21 లో దాదాపు 50 మిలియన్లకు పైగా నగదు యొక్క విత్ డ్రా లావాదేవీలు నమోదు అయినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈరోజు ప్రకటించింది. AePS లో బ్యాంక్ దాదాపు 7% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ లావాదేవీలలో 74% కంటే ఎక్కువ టైర్ 5/6 పట్టణాలలో ఉన్న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ పాయింట్ల ద్వారా ప్రాసెస్ చేయబడినట్లు సంస్థ ప్రకటించింది. 500,000 లకు పైగా గల బ్యాంకింగ్ పాయింట్లతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది మరియు ఈ బ్యాంకింగ్ పాయింట్లలో 50% AePS ఎనేబుల్ చేయబడ్డాయి.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

కోవిడ్ సమయంలో కస్టమర్‌లు తమ ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలను ఉపయోగించడం కోసం చూశారు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ మిలియన్ల మంది భారతీయులకు ఆర్థిక సేవలు అందేంత వరకు ఉండేలా తన రిటైల్ ఆధారిత బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను పెంచడంతో తన సర్వీస్ ను ఇప్పటికి సమర్థవంతంగా నడుపుతూనే ఉంది. AePS ప్లాట్‌ఫామ్ ద్వారా ఆధార్ ఎనేబుల్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ ఉన్న ఇతర బ్యాంకుల ఖాతాదారులకు కూడా బ్యాంక్ సేవలు అందించగలిగింది. FY21 లో AePS ద్వారా నగదు విత్డ్రా లావాదేవీలు ప్రతి త్రైమాసికానికి 10% పైగా వృద్ధిని నమోదు చేసింది.

నకిలీ విండోస్ 11 ఇన్‌స్టాలర్ల ప్రమాదం!! PCని సురక్షితంగా ఉంచటానికి చిట్కాలునకిలీ విండోస్ 11 ఇన్‌స్టాలర్ల ప్రమాదం!! PCని సురక్షితంగా ఉంచటానికి చిట్కాలు

ఎయిర్‌టెల్ పేమెంట్స్ లో ‘పే టు కాంటాక్ట్స్’ ఫీచర్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ లో ‘పే టు కాంటాక్ట్స్’ ఫీచర్

వినియోగదారులకు ఆన్‌లైన్ లావాదేవీలను మరింత అనుకూలంగా చేయడానికి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ నెల ప్రారంభంలో 'పే టు టు కాంటాక్ట్స్' ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు డబ్బు పంపాలనుకునే వారి డివైస్ నుండి మొబైల్ నంబర్/పరిచయాన్ని సౌకర్యవంతంగా ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

UPI ID

ఎయిర్‌టెల్ పేమెంట్స్ లో పే టు కాంటాక్ట్స్ ఫీచర్ రాకతో వినియోగదారులు డబ్బును పంపడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి యొక్క UPI ID ని మాన్యువల్‌గా జోడించాల్సిన అవసరం లేదు. వారు కేవలం కాంటాక్ట్ నెంబర్ ను ఎంచుకోవచ్చు మరియు సేవ్ చేయబడిన మొబైల్ నంబర్‌తో అనుబంధించబడిన వారి UPI ID కనిపిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు సమయంను ఆదా చేస్తుంది మరియు ఎలాంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది.

పెమెంట్స్

మహమ్మారి సమయంలో ఎయిర్‌టెల్ పెమెంట్స్ బ్యాంక్ ఖచ్చితంగా వినియోగదారుల జీవితాన్ని సులభతరం చేసింది. ఇది ఆన్‌లైన్‌లో యుటిలిటీ బిల్లుల కోసం చెల్లించడానికి వినియోగదారులను అనుమతించింది మరియు ఒకరికొకరు బ్యాంక్ అకౌంట్ బదిలీలను కూడా ప్రారంభించింది. ఆన్‌లైన్ లావాదేవీలను ఉపయోగించే వారి యొక్క జీవితాలలో ముందు ముందు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ పాత్ర పెరుగుతూనే ఉంటుంది.

Best Mobiles in India

English summary
Airtel Payments Bank Cash Withdrawal Creates Record Transactions

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X