ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ‘సేఫ్ పే’ కొత్త ఫీచర్‌!! సైబర్ కేటుగాళ్లకు చెక్

|

ఇండియాలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో సేవలను అందించడంతో పాటుగా ఆన్‌లైన్ ద్వారా పేమెంట్స్ చేయడానికి వీలుగా 'ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్' పేరుతో అత్యంత విజయవంతమైన ఫిన్‌టెక్ కంపెనీను కూడా కలిగి ఉంది. దీని సాయంతో వినియోగదారులు ఆన్‌లైన్ పద్దతిలో తమకు కావలసిన మొత్తం డబ్బును చాలా సౌకర్యవంతంగా పంపడానికి మరియు స్వీకరించడానికి అనుమతిస్తుంది. కానీ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ విధానంతో సైబర్ మోసగాళ్లు డబ్బును దొంగిలించడానికి ప్రజలను ఉచ్చులోకి నెట్టే ప్రమాదం ఉంది. ఈ విధానానికి చెక్ పెట్టడానికి ఎయిర్‌టెల్ తన పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌కు 'సేఫ్ పే' అనే ఫీచర్‌ను అమర్చింది. ఇది వినియోగదారులకు అదనపు రక్షణను అందిస్తూ డబ్బును సురక్షితంగా ఉండేలా చేస్తుంది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే' అంటే ఏమిటి?

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే' అంటే ఏమిటి?

సేఫ్ పే ఫీచర్ అనేది కొత్త విషయం ఏమి కాదు. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది పేమెంట్ ధృవీకరణ ప్రక్రియ యొక్క అదనపు ప్రొటెక్షన్. ఇది వినియోగదారులు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ ద్వారా జరిపే లావాదేవీలు మరింత సురక్షితమైనవిగా చేయడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్సిస్ ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది మీ అకౌంట్ నుండి లావాదేవీలు జరిగిన ప్రతిసారి లావాదేవీని ఆమోదించమని అడగబడుతు నిర్ధారనను పంపుతుంది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' OTA (ఓవర్ ది ఎయిర్) టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులకు వారి అకౌంట్ నుండి జరిగే లావాదేవీ గురించి హెచ్చరికను పంపుతుంది.

ఎయిర్‌టెల్ సేఫ్ పే

ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' ఫీచర్ అందుబాటులోకి రావడంతో ఇందుకోసం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అదనంగా ఏమైనా వసూలు చేస్తుంది అని అనుకుంటే కనుక పొరపాటు. దీనికోసం బ్యాంక్ ఏమి వసూలు చేయదని గమనించండి. కాబట్టి కస్టమర్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఆ లావాదేవీని యాక్సిస్ చేయడానికి వినియోగదారులు వారి mPIN లేదా OTPని నమోదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా సరైన mPIN లేదా OTPని నమోదు చేయడం వలన పేమెంట్ పూర్తిచేయబడుతుంది. కానీ ఎయిర్‌టెల్ సేఫ్ పే రాకతో mPIN లేదా OTPని నమోదు చేసిన తర్వాత కూడా వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి మాన్యువల్‌గా లావాదేవీని ఆమోదించమని అడగబడతారు.

ఎయిర్‌టెల్
 

ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' ఫీచర్ అనేది వినియోగదారుల అకౌంట్ నుండి డబ్బు పంపబడుతుందని వారిని హెచ్చరిస్తుంది. సాధారణంగా కొన్నిసార్లు ఎవరైనా తమ అకౌంట్ నుండి డబ్బును పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వినియోగదారులు అర్థం చేసుకోలేరు. కానీ ఈ అదనపు హెచ్చరిక అందుబాటులోకి రావడంతో వినియోగదారులు తాము చేస్తున్న లావాదేవీని ఆమోదించినట్లయితే మాత్రమే వారి డబ్బు తీసివేయబడుతుందని గమనించవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.1,099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.1,099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కొత్త ప్లాన్‌ల జాబితాలో రూ.1,099 ధర వద్ద ఒక నెల చెల్లుబాటుతో లభించే ప్లాన్ 200Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్ వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లకు కూడా ఉచిత యాక్సెస్ ను పొందుతారు. ఈ ప్యాక్ సబ్‌స్క్రైబర్‌లకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. ఇందులో సోనీలివ్, ఎరోస్‌నౌ, లయన్స్‌గేట్ ప్లే, హోయిచోయ్, మనోరమమాక్స్, షెమరూ, అల్ట్రా, హంగామాప్లే, EPICon, డివోటీవీ, క్లిక్, నమ్మఫ్లిక్స్, డాలీవుడ్ మరియు షార్ట్స్ టీవీతో సహా మరో 14 OTTల ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్‌తో ఎయిర్‌టెల్ 4Ki ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో 350కి పైగా టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel Payments Bank Comes With ‘Safe Pay’ New Feature: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X