ఎయిర్‌టెల్ మరో షాకిచ్చిన శశి అరోరా

Written By:

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలతో దూసుకుపోతున్న భారతీ ఎయిర్‌టెల్‌కు మరోషాక్‌ తగిలింది. ఈ కంపెనీ చెల్లింపుల బ్యాంకుకు చెందిన ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశి అరోరా రాజీనామా చేశారు. ఇటీవల బ్యాంకుపై చెలరేగిన వివాదం యుఐడిఎఐ సంస్థ ఇ-కెవైసీ లైసెన్స్ సస్పెన్షన్‌ నేపథ్యంలో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

రూ. 1249కే 4జీ స్మార్ట్‌ఫోన్, కండీషన్లు చూస్తే బేజారే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బహిరంగ ప్రకటన విడుదల చేస్తూ..

ఎయిర్‌టెల్ ఈ విషయంపై బహిరంగ ప్రకటన విడుదల చేస్తూ ఎయిర్‌టెల్‌‌ను వీడాలని అరోరా నిర్ణయించుకున్నారని ఆయన భవిష్యత్తు అవకాశాలు మరింత బావుండాలని కోరుతున్నామని తెలిపింది. 

సీఈవోగా జూన్ 1, 2016న..

కాగా 2006 నుండి సీనియర్ నాయకత్వ స్థానాల్లో పనిచేస్తున్న అరోరా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఎండీ, సీఈవోగా జూన్ 1, 2016న నియమితులయ్యారు.

వినియోగదారుల అనుమతి లేకుండానే ..

వినియోగదారుల అనుమతి లేకుండానే వంటగ్యాస్ సిలిండర్లపై కేంద్రం అందిస్తున్న సబ్సిడీనీ పేమెంట్‌ బ్యాంకుకు మళ్లిస్తున్న వైనం ఇటీవల వెలుగులోకి రావడంతో వివాదం రేగింది. దాదాపు రూ.190 కోట్ల మేర సబ్సిడీ మొత్తం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.

ఆధార్ ఇ-కెవైసీ ధ్రువీకరణ అధికారాన్ని..

ఈ వ్యవహారంపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీరియస్‌గా స్పందించింది. ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు ఆధార్ ఇ-కెవైసీ ధ్రువీకరణ అధికారాన్ని నిలిపివేసింది.

ఆడిట్ నివేదిక వచ్చేంత వరకు..

తుది విచారణ, ఆడిట్ నివేదిక వచ్చేంత వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Payments Bank head Shashi Arora quits More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot