Airtel Payments Bank కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు!! వాటి పూర్తి వివరాలు

|

భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్‌టెల్ సంస్థ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనే అనుబంధ సంస్థను కూడా కలిగి ఉంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన కస్టమర్‌ల కోసం కొత్తగా ఇప్పుడు రివార్డ్స్123 అనే పేరుతో కొత్తగా మూడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను విడుదల చేసింది. రివార్డ్స్123 సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ (APB) కస్టమర్‌లు ఆన్‌లైన్/డిజిటల్ లావాదేవీలు చేసినప్పుడు వారికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

రివార్డ్స్123 సబ్‌స్క్రిప్షన్‌

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులు రివార్డ్స్123 సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసిన తర్వాత వారు ప్రతి నెలా కూడా స్థిరమైన రివార్డ్‌లను పొందడానికి అర్హులవుతారు. ఇందులో అనేక రకాల లావాదేవీలపై నెలవారీ క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుంది అని గమనించండి. కస్టమర్‌లకు డెబిట్ కార్డ్ లాగే ప్లాటినమ్ ఆన్‌లైన్ మాస్టర్‌కార్డ్ ను కూడా అందించబడుతుంది. మీరు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ అయితే కనుక మీరు కొనుగోలు చేయడానికి కొత్తగా విడుదల చేసిన రివార్డ్స్123 ప్లాన్‌లు ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రివార్డ్స్ మినీ ప్లాన్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రివార్డ్స్ మినీ ప్లాన్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్(APB) అందించే రివార్డ్స్‌మినీ ప్లాన్ త్రైమాసికానికి రూ.99 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు వాలెట్‌కు డబ్బును జోడించడం, షాపింగ్ చేయడం మరియు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించడం వంటివి చేస్తున్నప్పుడు నెలకు రూ.80 వరకు క్యాష్‌బ్యాక్‌లను పొందుతారు. అదనంగా వర్చువల్ డెబిట్ కార్డ్ (SBA)/క్లాసిక్ ప్రీపెయిడ్ కార్డ్ వంటి వాలెట్‌లు కూడా ఉచితంగా లభిస్తాయి. వినియోగదారులు స్వీప్-అవుట్ సౌకర్యంతో అపరిమిత డిపాజిట్ల సౌకర్యాన్ని కూడా పొందుతారు.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రివార్డ్స్123+ ప్లాన్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రివార్డ్స్123+ ప్లాన్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రివార్డ్స్123+ ప్లాన్ ని వినియోగదారులు సంవత్సరానికి రూ.299 ధర వద్ద పొందవచ్చు. ఈ ప్లాన్ యొక్క అన్ని రకాల ప్రయోజనాలు రివార్డ్స్‌మినీ ప్లాన్ లాగానే ఉంటాయి. అంటే వినియోగదారులు ఫ్రీ ప్లాటినం వర్చువల్ డెబిట్ కార్డ్ (SBA) మరియు క్లాస్ ప్రీపెయిడ్ కార్డ్ (వాలెట్‌లు)లతో పాటు వినియోగదారులు ఉపయోగించే అనేక విషయాలపై రూ.80 వరకు క్యాష్‌బ్యాక్‌లను పొందుతారు. మళ్ళీ ఈ ప్లాన్‌తో వినియోగదారులు స్వీప్-అవుట్ సౌకర్యంతో అపరిమిత డిపాజిట్‌లను పొందుతారు.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రివార్డ్స్123 ప్లస్ ప్లాన్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రివార్డ్స్123 ప్లస్ ప్లాన్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులకు లభించే అత్యంత ఖరీదైన APB సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇది. ఈ రివార్డ్స్123ప్లస్ ప్లాన్ సంవత్సరానికి రూ.499 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క అన్ని రకాల ప్రయోజనాలు రివార్డ్స్123+ ప్లాన్ వలె ఉంటాయి. కానీ వీటి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే ఇది ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్‌లు అన్ని కూడా ప్రస్తుత ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్‌లకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయి. బ్యాంకింగ్ అనుబంధ సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ఇప్పటికే లాభదాయకంగా మారింది మరియు ఇలాంటి ప్లాన్‌లతో కంపెనీ మరింత వృద్ధి చెందబోతోంది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే'

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే'

ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది పేమెంట్ ధృవీకరణ ప్రక్రియ యొక్క అదనపు ప్రొటెక్షన్. ఇది వినియోగదారులు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ ద్వారా జరిపే లావాదేవీలు మరింత సురక్షితమైనవిగా చేయడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్సిస్ ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది మీ అకౌంట్ నుండి లావాదేవీలు జరిగిన ప్రతిసారి లావాదేవీని ఆమోదించమని అడగబడుతు నిర్ధారనను పంపుతుంది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' OTA (ఓవర్ ది ఎయిర్) టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులకు వారి అకౌంట్ నుండి జరిగే లావాదేవీ గురించి హెచ్చరికను పంపుతుంది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' ఫీచర్ అందుబాటులోకి రావడంతో ఇందుకోసం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అదనంగా ఏమైనా వసూలు చేస్తుంది అని అనుకుంటే కనుక పొరపాటు. దీనికోసం బ్యాంక్ ఏమి వసూలు చేయదని గమనించండి. కాబట్టి కస్టమర్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఆ లావాదేవీని యాక్సిస్ చేయడానికి వినియోగదారులు వారి mPIN లేదా OTPని నమోదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా సరైన mPIN లేదా OTPని నమోదు చేయడం వలన పేమెంట్ పూర్తిచేయబడుతుంది. కానీ ఎయిర్‌టెల్ సేఫ్ పే రాకతో mPIN లేదా OTPని నమోదు చేసిన తర్వాత కూడా వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి మాన్యువల్‌గా లావాదేవీని ఆమోదించమని అడగబడతారు.

Best Mobiles in India

English summary
Airtel Payments Bank Launches Three New Rewards123 Subscription Plans: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X