Home
News

Airtel Payment బ్యాంక్ యూజర్ల కోసం కొత్తగా కారు ఇన్సూరెన్స్‌ స్కీమ్

ఇండియాలో ప్రస్తుతం రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్ గా ఉన్న భారతి ఎయిర్‌టెల్ సంస్థ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు కారు భీమాను ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకుతో అందిస్తోంది. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకును ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో యాక్సెస్ చేయవచ్చు లేదా వెబ్ పోర్టల్‌ ద్వారా లాగిన్ అవ్వవచ్చు. యాప్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు వివిధ యుటిలిటీ పేమెంట్లను చేయవచ్చు లేదా వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు డబ్బును సులభంగా కూడా బదిలీ చేయవచ్చు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కారు బీమాను భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ కారు ఇన్సూరెన్స్‌ స్కీమ్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ కారు ఇన్సూరెన్స్‌ స్కీమ్

వినియోగదారులు ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో లాగిన్ అయ్యి కార్ల కోసం ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి బ్యాంకింగ్ విభాగంలో చూడవచ్చు. ఇది పూర్తిగా కాగిత రహిత ప్రక్రియ కావున మీకు ఎటువంటి పేపర్స్ అవసరం లేదు. అలాగే దీనిని అతి త్వరగా ముగించవచ్చు కూడా. వినియోగదారులు తమ ఇంటివద్దనే ఉండి చాలా సులభంగా దీన్ని పూర్తి చేయవచ్చు. స్మార్ట్ డ్రైవ్ ప్రైవేట్ కార్ భీమా దొంగతనంతో పాటు ప్రమాదవశాత్తు, సహజమైన లేదా మానవ నిర్మిత విపత్తు నుండి కారుకు ఇన్సూరెన్స్‌ చేయవచ్చు. పాలసీదారుల యొక్క వ్యక్తిగత ప్రమాదాలలో దేనినైనా ఇది కవర్ చేస్తుంది. పాలసీదారుడి శాశ్వత వైకల్యం లేదా జీవితాన్ని కోల్పోయే ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి ఆర్థిక సాయం లభిస్తుంది.

 

ఎయిర్‌టెల్ పేమెంట్స్ ద్వారా కారు ఇన్సూరెన్స్‌ చేసే విధానం

ఎయిర్‌టెల్ పేమెంట్స్ ద్వారా కారు ఇన్సూరెన్స్‌ చేసే విధానం

ఈ భీమాను కొనుగోలు చేయడానికి ఎయిర్‌టెల్ థాంక్స్ యూజర్లు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా సులభంగా చేయవచ్చు. ఈ ప్రక్రియ 5 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే కారు యొక్క ముందస్తు తనిఖీ కూడా ఉండదు. వినియోగదారులు తమ యొక్క వాహనం వివరాలను మాత్రమే పూరించవలసి ఉంటుంది. వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడిలో బీమా ఇవ్వబడుతుంది.

ఎయిర్‌టెల్ - కారు ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ - కారు ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ వినియోగదారులు వివిధ యాడ్-ఆన్ కవర్ల నుండి కూడా ఈ ఇన్సూరెన్స్‌ను ఎంచుకుంటారు. అయితే ఎయిర్‌టెల్ థాంక్స్ యూజర్లు మాత్రమే దీనిని వినియోగించగలుగుతారు. కార్ యొక్క రిప్లేసెమెంట్ చార్జీలు లేదా కీ కోల్పోవడం, ఇంజిన్ లేదా గేర్‌బాక్స్ దెబ్బతినడం, ఆసుపత్రికి చేరుకోవడానికి అంబులెన్స్ ఖర్చులు మరియు మరెన్నో వాటి కోసం ఈ కారు ఇన్సూరెన్స్‌ స్కీమ్ కవర్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel Payments Bank Now Starts Offering Car Insurance Policy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X