Airtel Payments Bankలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌

|

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ దేశంలో తన బ్యాంకింగ్ పాయింట్లలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కొత్త పేమెంట్స్ సహాయంతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులతో పాటు ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న ఏ బ్యాంకు యొక్క కస్టమర్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క 250,000 బ్యాంకింగ్ పాయింట్ల వద్ద ఆర్థిక లావాదేవీలను చేపట్టవచ్చు.

 

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులు AePS ఎనేబుల్ చేసిన బ్యాంకులో కూడా ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు. ఇది ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి మంచి చర్య. AePS యొక్క ప్రయోజనాలు వినియోగదారులకు చాలా రకాలుగా సహాయపడతాయి. ఇంకా ఈ కొత్త వ్యవస్థ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో భద్రతా వ్యవస్థను పెంచుతుందని కూడా అంటారు.

 

 

డ్రైవర్‌లేని కార్ల వాడకంలో పురోగతి, చిన్న రోబోట్ల వైపు చూపుడ్రైవర్‌లేని కార్ల వాడకంలో పురోగతి, చిన్న రోబోట్ల వైపు చూపు

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ - AePS ఫీచర్
 

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ - AePS ఫీచర్

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ లేదా AePS అనేది కొత్త చెల్లింపు వ్యవస్థ. ఈ వ్యవస్థలో వినియోగదారులు వారి ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడిని ఉపయోగించి మైక్రో ఎటిఎమ్‌లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని అనుమతిస్తుంది. ఆధార్ లేదా వర్చువల్ ఐడి వాడకం ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంటుకు యాక్సెస్ ఇస్తుంది. కస్టమర్ యొక్క ఆధార్ నంబర్ మరియు ఫింగర్ ప్రింట్ రికార్డులతో సరిపోలితేనే లావాదేవీలు యాక్సిస్ చేయబడతాయని కూడా గమనించాలి.

 

 

Apple ఆన్‌లైన్ స్టోర్ ఇండియాలో ప్రారంభానికి లైన్ క్లియర్...Apple ఆన్‌లైన్ స్టోర్ ఇండియాలో ప్రారంభానికి లైన్ క్లియర్...

AePS

AePS

AePS తో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన ఖాతాదారులకు మరియు ఇతర బ్యాంకుల వినియోగదారులకు విస్తృత శ్రేణి బ్యాంకింగ్ సేవలను అందించగలదు. దీని ద్వారా వారు ఇప్పుడు డబ్బును డ్రా చేసుకోగలరు, బ్యాలెన్స్ ఎంక్వైరీలు చేయగలరు మరియు 2,50,000+ వద్ద చిన్న స్టేట్‌మెంట్‌లను కూడా అభ్యర్థించవచ్చు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ పాయింట్లను AePS ప్రారంభించింది. అదేవిధంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు ఈ సేవలను ఇతర AePS ఎనేబుల్ చేసిన బ్యాంక్ నుండి పొందగలుగుతారు. ఇది మరొక అదనపు ప్రయోజనం.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

బ్యాంకింగ్ ప్రక్రియ

బ్యాంకింగ్ ప్రక్రియ

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో బ్యాంకింగ్ ప్రక్రియల యొక్క భద్రతాను AePS మరింత పెంచుతుంది. ఎందుకంటే వినియోగదారులు తమ బ్యాంకింగ్ లావాదేవీలను కేవలం వారి ఆధార్ నంబర్‌తో పూర్తి చేస్తే వారి బ్యాంక్ అకౌంట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఎవరికీ వెల్లడించకుండా పూర్తి చేస్తారు.

 

 

Reliance Jio తక్కువ ధరలో అందిస్తున్న 4G డేటా వోచర్‌ ప్లాన్‌లుReliance Jio తక్కువ ధరలో అందిస్తున్న 4G డేటా వోచర్‌ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్

ఎయిర్‌టెల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ గణేష్ అనంతనారాయణన్ మాట్లాడుతూ "AePS లో భాగం కావడానికి మేము సంతోషిస్తున్నాము. ఇది ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న ఏ బ్యాంకుకైనా వినియోగదారులు వారి సేవలను అమలుచేయడానికి వీలు కల్పిస్తుంది. AePS ప్లాట్‌ఫాం ప్రతి ఒక్కరికీ వారి ఆధార్‌ను మాత్రమే ఉపయోగించడం ద్వారా సురక్షితమైన బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఆర్థిక చేరిక గురించి భారత ప్రభుత్వ దృష్టికి తోడ్పడటానికి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చేసిన మరో దశ AePS రోల్-అవుట్ అని ఆయన తెలిపారు.

Best Mobiles in India

English summary
Airtel Payments Bank offers Aadhaar Enabled Payment System

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X