ఇకపై కార్డు లేకుండానే ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు
ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు కార్డ్ లేకుండానే కొన్ని ఎంపిక చేసిన ఏటీఎమ్‌ల్లో నగదును పొందవచ్చు.
ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు కార్డ్ లేకుండానే కొన్ని ఎంపిక చేసిన ఏటీఎమ్‌ల్లో నగదును పొందవచ్చు. ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ (ఐఎమ్‌టీ) టెక్నాలజీతో నడిచే ఏటీఎంలలో తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది. మరి ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నారా..దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎలా అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఐఎంటీ టెక్నాలజీ ఉన్న ఏటీఎంలను ..
యూజర్లు ఐఎంటీ టెక్నాలజీ ఉన్న ఏటీఎంలను ఉపయోగించుకుని ఈ రకమైన సేవలను పొందవచ్చు. వీటిని దేశ వ్యాప్తంగా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టనుంది.

మొబైల్ నంబర్‌తోపాటు సెండర్ కోడ్..
ఐఎంటీ టెక్నాలజీ ఉన్న ఏటీఎంలలో కస్టమర్లు తమ మొబైల్ నంబర్‌తోపాటు సెండర్ కోడ్‌ను ఎంటర్ చేయాలి.

మొబైల్‌కు వచ్చే ఓటీపీ
అనంతరం మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరువాత తమకు కావల్సిన మొత్తంలో డబ్బును ఏటీఎం నుంచి తీసుకోవచ్చు.

20వేల వరకు ఏటీఎంలు
దేశ వ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో ప్రస్తుతం ఐఎంటీ టెక్నాలజీ ఉన్న ఏటీఎంలు 20వేల వరకు ఉండగా, వాటిల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు ప్రస్తుతం నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.

1 లక్ష వరకు..
ఇక ఈ ఏడాది చివరి వరకు ఈ టెక్నాలజీ ఉన్న ఏటీఎంలను 1 లక్ష వరకు సిద్ధం చేయనున్నట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది.

పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులందరూ..
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులందరూ ప్రస్తుతం ఐఎంటీ సేవలను ఉపయోగించుకోవచ్చని ఎయిర్‌టెల్ ప్రతినిధి ఒకరు చెప్పారు.

నంబర్ డయల్..
అందుకు గాను కస్టమర్లు తన మొబైల్ ఫోన్లలో *400# నంబర్‌ను డయల్ చేయాలి. అనంతరం అందులో క్యాష్ విత్‌డ్రాయల్ రిక్వెస్ట్‌ను జనరేట్ చేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది.

ఆరంభ ఆఫర్..
ఆరంభ ఆఫర్‌గా మొదటి రెండు విత్‌డ్రాయల్స్‌కు రూ.25 లావాదేవీ ఫీజును రద్దు చేస్తున్నామని తెలిపింది.

ఇమ్‌పేస్ పేమెంట్ సిస్టమ్స్‌తో ఒప్పందం
ఇలాంటి ఏటీఎమ్‌లను నిర్వహించే ఇమ్‌పేస్ పేమెంట్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించింది.


Click it and Unblock the Notifications








