దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభం

న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.

|

భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు గురువారం దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభం

Read More : సంక్రాంతి బరిలో సామ్‌సంగ్ ఫోన్, రూ.8,490కే

పైలెట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రోగ్రామ్ క్రింద తొలత ఈ సర్వీసులను రాజస్దాన్‌లోని 10,000 ఎయిర్‌టెల్ రిటైల్ అవుట్‌లెట్‌లతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ఎయిర్‌టెల్ లాంచ్ చేయటం జరిగింది. ఈ ప్రయోగాత్మక సేవలు విజయవంతమవటంతో గురువారం నుంచి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోనూ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి వచ్చేసాయి.

 2,50,000 ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్‌లలో..

2,50,000 ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్‌లలో..

దేశవ్యాప్తంగా 2,50,000 ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్‌లలో బ్యాంకింగ్ పాయింట్లను అందుబాటులో ఉంచామని, 2017 చివరి నాటికి ఈ సంఖ్యను 6 లక్షలకు పెంచనున్నట్లు ఎయిర్‌టెల్ చెబుతోంది.

రూ.999కే Jio 4G VoLTE ఫోన్!రూ.999కే Jio 4G VoLTE ఫోన్!

రూ.3,000 కోట్ల పెట్టుబడి..

రూ.3,000 కోట్ల పెట్టుబడి..

దేశవ్యాప్తంగా తమకున్న 27 కోట్ల చందాదారుల్లో 10 కోట్ల మందిని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ సేవలకు కనెక్ట్ చేయటమే తమ లక్ష్యమని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. ఈ బ్యాంకు పై రూ.3,000 కోట్లను పెట్టుబడులుగా పెడుతున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

Airtel Money wallet వేరు,  Airtel Payments Bank వేరు

Airtel Money wallet వేరు, Airtel Payments Bank వేరు

ఇప్పటికే అందుబాటులో ఉన్న Airtel Money walletతో పోలిస్తే Airtel Payments Bank వేరుగా ఉంటుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనేది ఒక వ్యాలెట్ లానే కాకుండా ఇతర బ్యాంకులతో సులువుగా లావాదేవీలు జరుపుకునే విధంగా డిజైన్ చేయబండి. ఈ బ్యాంకులో మీరు దాచుకునే నగదుకు వడ్డి కూడా లభిస్తుంది.

రూ.1,999కే Lenovo P2 స్మార్ట్‌ఫోన్రూ.1,999కే Lenovo P2 స్మార్ట్‌ఫోన్

 సేవింగ్స్, డిపాజిట్స్, పేమెంట్స్

సేవింగ్స్, డిపాజిట్స్, పేమెంట్స్

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు ద్వారా కష్టమర్లు సేవింగ్స్, డిపాజిట్లు, పేమెంట్, అలాగే చెల్లింపులు లాంటి సేవలను ఆఫర్ చేస్తారు. కష్టమర్లు రూ. లక్ష వరకు ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు పలు సూచనలు...

ఆధార్ కార్డ్ తప్పనిసరి..

ఆధార్ కార్డ్ తప్పనిసరి..

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు తప్పనిసరిగా మీ వద్ద ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. మీరు ఎయిర్ కస్టమర్ కాకుపోయినా పర్వాలేదు.

రూ.346తో సంవత్సరమంతా ఐడియా 4జీరూ.346తో సంవత్సరమంతా ఐడియా 4జీ

సమీపంలోని ఎయిర్‌టెల్ రిటైల్ అవుట్‌లెట్‌‌కు వెళ్లండి..

సమీపంలోని ఎయిర్‌టెల్ రిటైల్ అవుట్‌లెట్‌‌కు వెళ్లండి..

బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు మీ సమీపంలోని ఎయిర్‌టెల్ రిటైల్ అవుట్‌లెట్‌‌ను సంప్రదించి ఆధార్ కార్డును సబ్మిట్ చేయాలి. అకౌంట్ ఓపెనింగ్ ప్రక్రియ పూర్తిగా పేపర్‌లెస్‌. అంటే నిమిషాల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.

 ఏటీఎమ్/డెబిట్/క్రెడెట్ సౌకర్యం..

ఏటీఎమ్/డెబిట్/క్రెడెట్ సౌకర్యం..

అకౌంట్ ఓపెన్ అయిన వెంటనే ఎయిర్‌టెల్ బ్యాంక్ మీకు ఏటీఎమ్/డెబిట్/క్రెడెట్ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తుంది. దీంతో ఎయిర్‌టెల్ బ్యాంక్ యూజర్లు తమ అకౌంట్‌లలో నగదును డిపాజిట్ చేయటంతో పాటు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు.

Paytmలో కొత్త యాడ్ అయిన 5 ఫీచర్లుPaytmలో కొత్త యాడ్ అయిన 5 ఫీచర్లు

బ్యాలన్స్ వివరాలు తెలుసుకోవాలంటే..?

బ్యాలన్స్ వివరాలు తెలుసుకోవాలంటే..?

ఎయిర్‌టెల్ మనీ యాప్ ద్వారా యూజర్లు తమ బ్యాంక్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునే వీలుంటుంది. ఎయిర్‌టెల్ మొబైల్ నెంబర్ నుంచి *400#కు డయల్ చేయటం ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

డిపాజిట్ల పై 7.25 శాతం వడ్డీ రేటు

డిపాజిట్ల పై 7.25 శాతం వడ్డీ రేటు

ఎయిర్‌టెల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసే వార్షిక పొదుపు ఖాతాల డిపాజిట్ల పై 7.25 శాతం వడ్డీ రేటును అందించనున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. అంతేకాకుండా ప్రతి సేవింగ్స్ అకౌంట్ పై రూ.లక్ష వరకు వ్యక్తిగత ప్రమాద భీమా ఉంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Airtel Payments Bank Officially Launched, Now Available Across 29 States. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X