Disney+ Hotstar VIPను ఉచితంగా అందిస్తున్న Airtel ప్లాన్‌లు ఇవే.....
ఇండియాలోని టెలికాం ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ ప్రస్తుత పోటీలో తిరిగి పుంజుకోవడానికి మరియు వినియోగదారుల బేస్ ను పెంచుకోవడానికి కొత్తగా వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తున్నది. ఎయిర్‌టెల్ యొక్క పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఇప్పుడు ఎయిర్టెల్ థాంక్స్ మొబైల్ యాప్ లో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా డిస్నీ + హాట్స్టార్ విఐపి సభ్యత్వాన్ని ఉచితంగా పొందవచ్చు.

డిస్నీ + హాట్‌స్టార్ VIP ఉచిత సభ్యత్వం
ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో కొత్తగా అప్ డేట్ చేసిన నిబంధనలు మరియు షరతుల ప్రకారం రూ.499 ధరపైన లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు మరియు రూ.999 కంటే ఎక్కువ ధర గల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే డిస్నీ + హాట్స్టార్ విఐపి చందా కాంప్లిమెంటరీ యాక్సిస్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ - డిస్నీ + హాట్‌స్టార్ VIP సభ్యత్వం
ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం ఇప్పుడు ప్రత్యేకంగా డిస్నీ + హాట్‌స్టార్ VIP హాట్‌స్టార్ సభ్యత్వాన్ని ప్రస్తుతం ఆఫర్లో భాగంగా అందిస్తుంది అని కంపెనీ తెలిపింది. ఎయిర్టెల్ కస్టమర్లు డిస్నీ + హాట్స్టార్ విఐపి ఆఫర్ కోసం వారి అర్హతను ఎయిర్టెల్ థాంక్స్ యాప్ యొక్క ‘థాంక్స్' పేజీలో తనిఖీ చేయవచ్చు. అర్హత కలిగిన ప్రతి పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ద్వారా ఒక కస్టమర్ స్వతంత్రంగా ఒక్కసారి మాత్రమే ఈ ఆఫర్‌ను పొందగలడని టెల్కో పేర్కొంది. డిస్నీ + హాట్స్టార్ విఐపి సభ్యత్వం ఒక సంవత్సరానికి రూ.399 ధర వద్ద లభిస్తుంది.

డిస్నీ + హాట్‌స్టార్ VIP సభ్యత్వంను ఉచితంగా అందిస్తున్న జియో ప్లాన్‌లు
రిలయన్స్ జియో కొన్ని నెలల క్రితం జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ అనే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టినప్పుడు ఎయిర్‌టెల్ దాని కంటే కాస్త వెనుకబడి ఉంది. ఉదాహరణకు రిలయన్స్ జియో యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రూ.399ల నుండి ప్రారంభమవుతాయి. ఇవి రూ.199 విలువైన నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్, రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం మరియు రూ.399 విలువైన డిస్నీ + హాట్స్టార్ విఐపి సభ్యత్వం వంటి OTT ప్రయోజనాలను అందిస్తున్నాయి.

డిస్నీ + హాట్‌స్టార్ VIP సభ్యత్వంను ఉచితంగా అందిస్తున్న Airtel పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు
రూ.499 ధర నుండి ప్రారంభమైన ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ఇంతకు ముందు కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని మాత్రమే అందించడంతో జియో కంటే ఎయిర్‌టెల్ వెనుక వరుసలో ఉంది. అయినప్పటికీ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలలో ప్రస్తుతం డిస్నీ + హాట్స్టార్ విఐపి చందా ఆఫర్‌ను తిరిగి ప్రవేశపెట్టడంతో ఎయిర్‌టెల్ ఇప్పుడు రిలయన్స్ జియోకు సమానమైన ప్రయోజనాలను అందిస్తున్నది. ఏదేమైనా తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో రూ.199 నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ప్రయోజనంను ఎయిర్‌టెల్ ఇప్పటికీ అందించడం లేదు కనుక జియో కంటే వెనుకంజలో ఉంది.

డిస్నీ + హాట్‌స్టార్ VIP సభ్యత్వంను ఉచితంగా అందిస్తున్న ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల విషయానికొస్తే అవి రూ.499 నుంచి ప్రారంభమవుతాయి. అయితే డిస్నీ + హాట్స్టార్ విఐపి యొక్క ప్రయోజనం మాత్రం రూ.999 ధర కంటే పైన ఉన్న ప్లాన్‌లతో మాత్రమే లభిస్తుంది. భారతి ఎయిర్‌టెల్ ప్రస్తుతం రూ.499, రూ.799, రూ.999, రూ.1,499 మరియు రూ.3,999 ధరల వద్ద లభించే ఐదు రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను మాత్రమే అందిస్తోంది. కానీ చివరి మూడు ప్లాన్‌లు మాత్రమే డిస్నీ + హాట్స్టార్ విఐపి యొక్క సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తుంది.ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా డిస్నీ + హాట్స్టార్ విఐపి సభ్యత్వాన్ని పొందడానికి మీరు అర్హులు అవునా కాదా అని సులభంగా తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications