30 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు.. పూర్తి జాబితా, ప్రయోజనాలు..!
ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో (Airtel Prepaid recharge plans with 30 days validity) అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. దీంతోపాటు అనేక కాలింగ్, SMS, డేటా ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వినియోగదారుల్లో అనేక మంది వ్యాలిడిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ తరహా రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన రీఛార్జ్ ప్లాన్లు, ప్రయోజనాల వివరాలు మీకోసం.
జులై నెలలో ప్రైవేటు టెలికాం ప్రొవైడర్లు ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా సంస్థలు భారీగా ఛార్జీలు పెంచాయి. దీంతో అనేక మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కు పోర్టింగ్ అవుతున్నారు. దీంతో దిద్దుబాటులో చర్యల్లో భాగంగా ఈ సంస్థలు వినియోగదారులను కాపాడుకొనేందుకు ఆకర్షణీయమైన ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

ఎయిర్‌టెల్ రూ.219 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు ప్లాన్‌లో మొత్తంగా 3GB డేటాను పొందవచ్చు. వీటితోపాటు Wink మ్యూజిక్, హలో ట్యూన్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు.
రూ.355 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 25GB డేటాను పొందవచ్చు. హాలో ట్యూన్స్ సహా Wink మ్యూజిక్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
రూ.589 రీఛార్జ్ ప్లాన్ : ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ రూ.589 తో మొత్తంగా 50GB డేటాను వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మరియు హలో ట్యూన్స్, Wink మ్యూజిక్ ను కూడా వినియోగించుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
ఎయిర్‌టెల్ రూ.619 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో 60 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లు, రోజువారీ 1,5GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హలో ట్యూన్స్ సహా Wink మ్యూజిక్ యాప్‌ను కూడా వినియోగించుకోవచ్చు.
ఎయిర్‌టెల్ గత నెలలో డేటా బూస్టర్ ప్లాన్‌లు రూ.51, రూ.101, రూ.151 అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.51 ప్లాన్ ద్వారా రూ.3GB డేటా, రూ.101 ప్లాన్‌తో రూ.6GB డేటా, రూ.151 ప్లాన్‌తో 9GB డేటాను పొందవచ్చు. ఈ బూస్టర్ ప్లాన్ ప్రయోజనాలు ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ బూస్టర్ ప్లాన్‌లు ఉపయోగపడనున్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








