Airtel Wi-Fi Callingతో ఫోన్ కాల్ డ్రాప్‌లకు చెక్...

|

భారతీయ టెలికాం పరిశ్రమ గత కొన్నేళ్లుగా విపరీతమైన వృద్ధిని సాధించింది. విస్తృతమైన చవకైన కాలింగ్ ప్లాన్లు మరియు 4G ఇంటర్నెట్‌ కనెక్టివిటీలను కూడా ప్రారంభించారు. ఎయిర్టెల్ వంటి ఆపరేటర్లు అక్కడ ఆగిపోకుండా వై-ఫై కాలింగ్ సర్వీసులను కూడా మొదలుపెట్టారు.

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్

ఇండోర్ కనెక్టివిటీ సమస్యలకు పరిష్కారంను గత డిసెంబర్‌లో కనుగొన్న తొలి భారతీయ టెలికం ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది. మీకు అందుబాటులో ఉన్న ఏదైనా వై-ఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించి మీకు నచ్చిన వారికి మెరుగైన ఫోన్ కాల్స్ చేయడానికి కంపెనీ ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సర్వీసును ప్రారంభించింది. దీని కోసం మీకు కావలసిందల్లా 4G స్మార్ట్‌ఫోన్ మరియు వై-ఫై కనెక్షన్. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Jio,Vodafone,Airtel: రోజుకు 2GB డేటాను అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లుJio,Vodafone,Airtel: రోజుకు 2GB డేటాను అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ అంటే ఏమిటి?

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ అంటే ఏమిటి?

ఎయిర్టెల్ సంస్థ తన చందాదారుల కోసం తాజా కొత్త ఫీచర్లలో భాగంగా సాధారణ నెట్‌వర్క్‌కు బదులుగా వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగించి ఫోన్ కాల్స్ చేయడానికి లేదా స్వీకరించడానికి అనుమతిస్తుంది. దీని కోసం వినియోగదారులకు మంచి వై-ఫై నెట్‌వర్క్ ఉంటే సరిపోతుంది. మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఫోన్ కాల్‌లను పొందవచ్చు. ఇండియాలో ఈ సేవను అందించినది ఎయిర్‌టెల్ సంస్థ మొదటిది మాత్రమే కాదు కేవలం రెండు నెలల్లో 3 మిలియన్ల యూజర్‌బేస్ సాధించింది. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ కొత్త టెక్నాలజీ 10 మిలియన్ల వరకు ఉంటుందని కంపెనీ ఆశిస్తోంది.

 

 

YouTube వీడియోలను రిపీట్ మోడ్(లూప్‌) లో ప్లే చేయడం ఎలా?YouTube వీడియోలను రిపీట్ మోడ్(లూప్‌) లో ప్లే చేయడం ఎలా?

కొత్త టెక్‌లో మారేది ఏమిటి?

కొత్త టెక్‌లో మారేది ఏమిటి?

ఈ కొత్త టెక్‌లో కాల్ డ్రాప్‌లకు సహాయం చేయడం కంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ జనసాంద్రత గల ప్రాంతాలలో సాధారణ సెల్యులార్ నెట్‌వర్క్‌ల యొక్క సమస్యను తీర్చడానికి గొప్ప సాధనంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎయిర్టెల్ కొత్త సేవను ఉచితంగా అందిస్తోంది. వినియోగదారులు వారి ప్రస్తుత మొబైల్ ప్లాన్లలో ఈ సేవను ఉపయోగించడం కొనసాగించవచ్చు.

 

 

Realme C3 Sale ప్రారంభం... డిస్కౌంట్ ఆఫర్స్ అదుర్స్...Realme C3 Sale ప్రారంభం... డిస్కౌంట్ ఆఫర్స్ అదుర్స్...

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే HD లేదా VoLTE వాయిస్ సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాల నుండి కూడా HD కాల్‌లను చేయడానికి ఇప్పుడు అవకాశం ఉంది. కాబట్టి మీకు అనుకూలమైన స్మార్ట్‌ఫోన్ మరియు ఎయిర్‌టెల్ సిమ్ ఉన్నాయని నిర్ధారించుకోండి మరియు మీకు నచ్చిన వారికి కాల్స్ చేయవచ్చు.

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

 

 

మీ మొబైల్ ఈ సర్వీస్ కోసం సిద్ధంగా ఉందా?

మీ మొబైల్ ఈ సర్వీస్ కోసం సిద్ధంగా ఉందా?

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్ ఆపిల్ ఐఫోన్‌ల నుండి శామ్‌సంగ్ యొక్క వివిధ లైనప్‌ల వరకు మరియు అనేక రకాల స్మార్ట్‌ఫోన్‌లకు కూడా మద్దతును ఇస్తుంది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు సరసమైన స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఈ సేవను పొందవచ్చు. అంతేకాకుండా మీరు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటే మీరు జియో మాదిరిగా కాకుండా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో మాత్రమే వై-ఫై కాలింగ్‌ను ప్రారంభించవచ్చు. కింద తెలిపిన జాబితా స్మార్ట్‌ఫోన్‌లకు వై-ఫై కాలింగ్ సర్వీస్ లభిస్తుంది.

 

 

Poco X2 Review in Telugu: 120HZప్యానల్,27W ఫాస్ట్ చార్జర్, బెస్ట్ ఫీచర్లుPoco X2 Review in Telugu: 120HZప్యానల్,27W ఫాస్ట్ చార్జర్, బెస్ట్ ఫీచర్లు

హ్యాండ్‌సెట్‌

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్ కోసం అనుకూలమైన హ్యాండ్‌సెట్‌ల మొత్తం జాబితాను తనిఖీ చేయడానికి https://www.airtel.in/wifi-calling ని సందర్శించండి . Wi-Fi కాలింగ్ మరియు హ్యాండ్‌సెట్ల అనుకూలతను యాక్టీవ్ చేసే దశలను నేరుగా లింక్‌లో తనిఖీ చేయవచ్చు.

 

 

Disha app ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా వాడాలి, గైడ్ మీకోసం.Disha app ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా వాడాలి, గైడ్ మీకోసం.

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌ను ఎలా ఉపయోగించాలి?

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌ను ఎలా ఉపయోగించాలి?

ఎయిర్‌టెల్ అన్ని సర్కిల్‌లకు జాతీయంగా ఈ కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లలో ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ అందుబాటులో ఉంది. అంటే మీరు ఎయిర్‌టెల్ యూజర్‌గా ఉన్నంత వరకు మీరు ఎటువంటి వై-ఫై కనెక్షన్‌ ద్వారా అయినా కూడా ఈ సేవను ఆస్వాదించవచ్చు.

 

 

BSNL 999 Plan వాలిడిటీ మరో నెల రోజులపాటు పెంపుBSNL 999 Plan వాలిడిటీ మరో నెల రోజులపాటు పెంపు

ఎయిర్‌టెల్ సిమ్

మీ ఫోన్ ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌కు అనుకూలంగా ఉంటే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కు కనెక్ట్ చేసి ఆపై మీ ఎయిర్‌టెల్ సిమ్ కోసం VoLTE సేవను ఆన్ చేయండి. అలా చేయడానికి కింద దశలను అనుసరించండి.

*** మీరు మీ ఫోన్ యొక్క సెట్టింగులను ఓపెన్ చేయండి.

*** అందులోని నెట్‌వర్క్‌ ఆప్షన్ ను ఎంచుకోండి.

*** నెట్‌వర్క్‌ ఆప్షన్లోని ఎయిర్‌టెల్ సిమ్ ను ఎంచుకోండి.

*** తరువాత VoLTE కి వెళ్లాలి .

*** ఇప్పుడు Wi-Fi కాలింగ్‌ను చేయడానికి సెట్టింగ్‌లు> నెట్‌వర్క్ సెట్టింగ్‌లు> ఎయిర్‌టెల్ సిమ్> యాక్టివేట్ కాల్స్ యూసింగ్ Wi-Fi .

ఎయిర్‌టెల్ తన తాజా వై-ఫై కాలింగ్ సేవతో వినియోగదారులు దీనిని ఉపయోగించకుండా ఉండటాన్ని ఇర్రెసిస్టిబుల్ చేసింది. కాబట్టి దీన్ని మీ ఫోన్‌లో ఆన్ చేసి వ్యత్యాసాన్ని అనుభవించండి.

 

Best Mobiles in India

English summary
Airtel Puts An End To Call Drops With Free Airtel Wi-Fi Calling
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X