అందుబాటు ధ‌ర‌లో నాలుగు నెల‌వారీ ప్లాన్స్ విడుద‌ల చేసిన Airtel!

|

భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి Airtel, తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి స‌రికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను వినియోగ‌దారుల‌కు ప‌రిచ‌యం చేసింది. తాజాగా మొత్తం నాలుగు రీఛార్జీ ప్లాన్ల‌ను విడుద‌ల చేయ‌గా, అవ‌న్నీ నెల‌వారీ వ్యాలిడిటీని క‌లిగిన‌వే కావ‌డం విశేషం. వీటిని స్మార్ట్‌, రేట్ క‌ట్ట‌ర్ ప్లాన్లుగా కంపెనీ పేర్కొంది. ఈ నాలుగు ప్లాన్లు అన్నీ అఫ‌ర్డ‌బుల్ ధ‌ర‌లో రూ.140 కి త‌క్కువ‌గానే ఉన్నాయి. అందులో అతి త‌క్కువ ధ‌ర క‌లిగిన రీచార్జ్ ప్లాన్ రూ.109 కాగా, ఎక్కువ ధ‌ర క‌లిగిన ప్లాన్ రూ.131 గా ఉంది.

 
అందుబాటు ధ‌ర‌లో నాలుగు నెల‌వారీ ప్లాన్స్ విడుద‌ల చేసిన Airtel!

అధిక మొత్తం డ‌బ్బు చెల్లించి రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోకుండానే తమ మొబైల్ నంబర్‌లను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి ఈ కొత్త Airtel ప్లాన్‌లు అనుకూలంగా ఉంటాయి. వీటినే రేట్ కట్టర్ ప్లాన్‌లుగా పిలుస్తారు. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌ల‌పై ఓ లుక్కేద్దాం ప‌దండి.

Airtel రూ.109 ప్లాన్‌:
ఎయిర్‌టెల్ నుంచి ఇదురవ‌ర‌కే ఉన్న రూ.99 ప్లాన్‌తో పోలిస్తే రూ.109 ప్లాన్ ఎక్కువ వ్యాలిడిటీని, ఎక్కువ డేటా బెనిఫిట్స్‌ను క‌ల్పిస్తుంది. ఈ రూ.109 రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్‌ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న యూజ‌ర్ల‌కు 200MB డేటాను అందిస్తోంది. అంతేకాకుండా రూ.99 టాక్‌టైం ను కూడా అందిస్తోంది. వాయిస్ కాల్స్ కు ఒక సెక‌నుకు 2.5 పైసా ప‌డుతుంది. లోక‌ల్ ఎస్ఎంఎస్‌కు రూ.1, మ‌రియు ఎస్‌టీడీ ఎస్ఎంఎస్‌కు రూ.1.44 ప‌డుతుంద‌ని కంపెనీ పేర్కొంది.

అందుబాటు ధ‌ర‌లో నాలుగు నెల‌వారీ ప్లాన్స్ విడుద‌ల చేసిన Airtel!

Airtel రూ.111 ప్లాన్‌:
ఈ రూ.111 రీఛార్జ్ ప్లాన్ ద్వారా సేమ్ రూ.109 ప్లాన్‌తో పొందే బెనిఫిట్స్ కంపెనీ అందిస్తోంది. Airtel ఈ ప్లాన్ రీఛార్జ్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న యూజ‌ర్ల‌కు 200MB డేటాను అందిస్తోంది. అంతేకాకుండా రూ.99 టాక్‌టైం ను కూడా అందిస్తోంది. వాయిస్ కాల్స్ కు ఒక సెక‌నుకు 2.5 పైసా ప‌డుతుంది.

అందుబాటు ధ‌ర‌లో నాలుగు నెల‌వారీ ప్లాన్స్ విడుద‌ల చేసిన Airtel!

Airtel రూ.128 ప్లాన్‌:
Airtel విడుద‌ల చేసిన ఈ రూ.128 రీఛార్జ్ ప్లాన్ నెల రోజుల వ్యాలిడిటీ క‌లిగి ఉంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు సెకనుకు 2.5 పైసా టారిఫ్ ప‌డుతుంది. అంతేకాకుండా, వీడియో కాల్స్ కు సెకనుకు రూ.5, మరియు అదనంగా ఎంబీ డేటాకు 50 పైసలు ప‌డుతుంది.

అందుబాటు ధ‌ర‌లో నాలుగు నెల‌వారీ ప్లాన్స్ విడుద‌ల చేసిన Airtel!

Airtel రూ.131 ప్లాన్‌:
Airtel విడుద‌ల చేసిన ఈ రూ.131 రీఛార్జ్ ప్లాన్ నెల రోజుల వ్యాలిడిటీ క‌లిగి ఉంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు లోక‌ల్, ఎస్‌టీడీ కాల్స్‌కు సెకనుకు 2.5 పైసా టారిఫ్ ప‌డుతుంది. అంతేకాకుండా, నేష‌న‌ల్ వీడియో కాల్స్ కు సెకనుకు రూ.5, మరియు అదనంగా యూజ్ చేస్తే ఎంబీ డేటాకు 50 పైసలు ప‌డుతుంది. ఇక ఎస్ఎంఎస్‌ల విష‌యానికి వ‌స్తే లోక‌ల్ మెసేజ్‌ల‌కు రూ.1, నేష‌న‌ల్ మెసేజ్‌ల‌కు రూ.1.5 టారిఫ్ ప‌డుతుందని కంపెనీ తెలిపింది.

ఇటీవ‌ల భార‌త ప్ర‌భుత్వం రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా రూ.228, రూ.239 ధ‌ర‌లో రెండు నెల‌వారీ ప్లాన్ల‌ను వినియోగ‌దారుల‌కు ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే. వాటిని కూడా ఓ సారి పరిశీలిద్దాం.
BSNL Rs. 228 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ BSNL STV 228 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. డైలీ డేటా లిమిట్ అయిన త‌ర్వాత నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. ఈ ప్రయోజనాలతో పాటు, BSNL ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్లాన్‌ని ఎంచుకున్న సబ్‌స్క్రైబర్‌ల కోసం ప్రోగ్రెసివ్ వెబ్ యాప్‌లో ఛాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్‌ను కూడా ఆఫ‌ర్‌ చేస్తుంది.

 

BSNL Rs. 239 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ BSNL STV 239 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. రూ.10 టాక్‌టైమ్ పొంద‌వ‌చ్చు. ఈ టాక్‌టైమ్ వాల్యూ మెయిన్ అకౌంట్‌కు యాడ్ చేసే సౌక‌ర్యాన్ని క‌ల్పించారు.

Best Mobiles in India

English summary
Airtel Rate Cutter Plans Launched Starting From Rs. 109

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X