Just In
- 17 min ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 8 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 11 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- News
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు తీర్పు 6న
- Movies
Michael day 1 collections మైఖేల్‌కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
FY22లో కష్టమర్ల నుండి అత్యధిక ఫిర్యాదులను పొందిన టెలికాం సంస్థ ఎదో తెలుసా?
భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్‌టెల్ FY22లో వినియోగదారుల నుండి అత్యధిక ఫిర్యాదులను అందుకుంది. ప్రైవేట్ టెల్కోల జాబితాలో ఎయిర్‌టెల్ తర్వాత వొడాఫోన్ ఐడియా (Vi) అధికంగా ఫిర్యాదులను అందుకోగా జియో సంస్థ స్వల్పంగా ఫిర్యాదులను అందుకున్నది. పిటిఐ నివేదిక ప్రకారం FY 2021-22లో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు అన్ని కూడా సుమారు ఐదు కోట్లకు పైగా ఫిర్యాదులను అందుకున్నాయి అని దేవుసిన్ చౌహాన్ తెలిపారు. ఇందులో అత్యధికంగా 54% తో ఫిర్యాదులను భారతీ ఎయిర్‌టెల్ అందుకున్నది.

FY22లో పొందిన అధిక ఫిర్యాదుల యొక్క నిర్దిష్ట సంఖ్యల విషయానికి వస్తే ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ మొత్తంగా 2,99,68,519 ఫిర్యాదులను అందుకోగా వొడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తరువాతి స్థానంలో మొత్తంగా 2,17,85,460 ఫిర్యాదులను అందుకున్నది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) గురించి కూడా మరచిపోకూడదు. BSNL మరియు MTNL లపై ఫిర్యాదుల సంఖ్య వరుసగా 8.8 లక్షలు మరియు 48,710గా ఉన్నాయని చౌహాన్ పేర్కొన్నారు.

దేశంలోనే అతిపెద్ద సబ్‌స్క్రైబర్ బేస్ ను కలిగి ఉన్న జియో టెల్కో కేవలం 25.8 లక్షల ఫిర్యాదులు మాత్రమే అందుకున్నది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ సంస్థ తనను తాను ప్రీమియం ఆపరేటర్‌గా పరిగణిస్తున్నందున ఇది ఆసక్తికరమైన అంశంగా మారింది. అదే గనుక నిజమైతే ఏడాదిలో ఎయిర్‌టెల్‌తో పోలిస్తే జియోకు చాలా తక్కువ ఫిర్యాదులు ఎలా వచ్చాయి? అయితే ఇక్కడ ఆసక్తికరంగా మరొక రెండు విషయాలు ఉన్నాయి. వీటిలో మొదటిది ఆపరేటర్‌లకు ఎలాంటి ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. మరియు మరొకటి వినియోగదారుల సంతృప్తి కోసం ఆపరేటర్‌లు ఎన్ని ఫిర్యాదులను అనుసరించారు?

దేశంలో అధికంగా వినియోగదారులను కలిగి ఉన్న ఎయిర్‌టెల్‌కు అత్యధిక ఫిర్యాదులు రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. FY22లో వినియోగదారుల నుండి జియోకి కనిష్టంగా 10x కంటే తక్కువ ఫిర్యాదులు వచ్చాయి. అంటే జియో కస్టమర్‌లు ఉత్తమమైన సేవలను పొందుతున్నారు లేదా జియో కస్టమర్‌లు కంపెనీ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదును నమోదు చేయడానికి ఆసక్తిని చూపడం లేదు. ఓపెన్ సిగ్నల్స్ ప్రకారం జియో టెల్కో భారతదేశంలో 4G యొక్క లభ్యత మరియు కవరేజీని మెరుగ్గా కలిగి ఉంది. TRAI MySpeed డేటా ప్రకారం జియో సంస్థ భారతదేశంలో వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. కాబట్టి జియో అత్యుత్తమ కవరేజీని అందించడమే కాకుండా వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్ స్పీడ్‌ను అందిస్తోంది. అయితే జియో కస్టమర్ల వద్ద నుండి అధిక ఫిర్యాదులు ఎందుకు లేవనేదే ఆశ్చర్యపోనవసరం లేదు.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే' అంటే ఏమిటి?
సేఫ్ పే ఫీచర్ అనేది కొత్త విషయం ఏమి కాదు. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది పేమెంట్ ధృవీకరణ ప్రక్రియ యొక్క అదనపు ప్రొటెక్షన్. ఇది వినియోగదారులు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా జరిపే లావాదేవీలు మరింత సురక్షితమైనవిగా చేయడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్సిస్ ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది మీ అకౌంట్ నుండి లావాదేవీలు జరిగిన ప్రతిసారి లావాదేవీని ఆమోదించమని అడగబడుతు నిర్ధారనను పంపుతుంది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' OTA (ఓవర్ ది ఎయిర్) టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులకు వారి అకౌంట్ నుండి జరిగే లావాదేవీ గురించి హెచ్చరికను పంపుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470