ఎయిర్‌టెల్ దుమ్మురేపే ఆఫర్లు.. కేవలం రూ.10తో రీఛార్జ్.. ఇంకా రూ.100లోపు బడ్జెట్ ప్లాన్స్ ఇవే!
Airtel Recharge Plans: భారతదేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఎయిర్‌టెల్ ఒకటి. అయితే ప్రస్తుత పోటీ వాతావరణంలో ఈ కంపెనీ స్పెషల్ ఆఫర్లు తీసుకొస్తోంది. ముఖ్యంగా తక్కువ ధరలో టాక్ టైమ్ లేదా డేటా కావాలనుకునే కస్టమర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లు కేవలం రూ.10 నుంచే స్టార్ట్ అవుతాయి. అవసరానికి తగ్గట్టుగా ఎంచుకునే వెసులుబాటు కూడా ఉంది. మరి ఈ తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లపై ఓ లుక్కేద్దాం.
* టాక్ టైమ్ రీఛార్జ్ ప్లాన్లు
- రూ.10, రూ.20, రూ.100 టాక్ టైమ్ ప్లాన్లు

రూ.10 అనేది ఒక టాప్-అప్ వోచర్. దీంతో మీకు రూ.7.47 టాక్ టైమ్ వస్తుంది. దీనికి వ్యాలిడిటీ లిమిట్ లేదు. అంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు. కానీ ఈ ప్లాన్‌లో డేటా బెనిఫిట్స్ మాత్రం ఉండవు. రూ.20 ప్లాన్‌లో మీకు రూ.14.95 టాక్ టైమ్ లభిస్తుంది. రూ.10 ప్లాన్ లాగే దీనికి కూడా ఎక్స్‌పైరీ డేట్ లేదు.
అర్జెంటుగా టాక్ టైమ్ కావాల్సిన వాళ్లకి లేదా సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వాళ్లకి ఇది బాగా యూజ్ అవుతుంది. కానీ ఇందులో డేటా మాత్రం ఉండదు. రెండు సిమ్‌లు మేనేజ్ చేయలేక సతమతమవుతున్న వారు రూ.20 ప్లాన్ గురించి తెలుసుకుంటే చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
అంతేకాదు రూ.100 టాక్ టైమ్ ప్లాన్ కూడా ఉంది. దీని ద్వారా మీకు రూ.81.75 టాక్ టైమ్ వస్తుంది. దీనికీ ఎక్స్‌పైరీ డేట్ లేదు. ఎక్కువ బ్యాలెన్స్ కావాలనుకునే వాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. కానీ ఇందులో కూడా డేటా బెనిఫిట్స్ ఉండవు. సిమ్ చాలా రోజులు యాక్టివ్‌గా ఉండాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లాన్.
* డేటా రీఛార్జ్ ప్లాన్లు
- రూ.11, రూ.22, రూ.26 డేటా ప్లాన్లు
రూ.11 ప్లాన్‌లో మీకు 1 గంట పాటు అన్‌లిమిటెడ్ డేటా వస్తుంది. అర్జెంట్‌గా ఇంటర్నెట్ కావాల్సినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. రూ.22 ప్లాన్ ఒక్క రోజుకి 1GB డేటాని అందిస్తుంది. తక్కువ టైమ్‌కి ఇంటర్నెట్ కావాలనుకునే వాళ్లకి ఇది మంచి ఛాయిస్. కానీ ఈ రెండు ప్లాన్లలో టాక్ టైమ్ ఉండదు.
రూ.26 ప్లాన్‌లో రోజుకి 1.5GB డేటా వస్తుంది. కొంచెం ఎక్కువ డేటా కావాలనుకునే వాళ్లకి ఇది సూటవుతుంది. ఇందులో టాక్ టైమ్ లభించదు. రూ.33 డేటా ప్లాన్‌లో 2GB డేటా వస్తుంది, ఇది ఒక రోజు వరకు వ్యాలిడిటీతో వస్తుంది. ఎక్కువ ఇంటర్నెట్ వాడేవాళ్లకి ఇది బాగా పనికొస్తుంది. కానీ టాక్ టైమ్ మాత్రం మిస్సింగ్.
- రూ.49, రూ.77, రూ.99 డేటా ప్లాన్లు
ఈ ప్లాన్‌లో ఒక రోజు మొత్తం అన్‌లిమిటెడ్ డేటా వస్తుంది. అంతేకాదు, డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్ కూడా ఉంది. మొబైల్ డేటాపై ఎక్కువగా ఆధారపడేవాళ్లకి ఇది మంచి ప్లాన్. కానీ ఇందులో టాక్ టైమ్ ఉండదు. రూ.77 ప్లాన్‌లో 5GB డేటా వస్తుంది, ఇది 7 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది.
తక్కువ డేటా కావాలనుకునే వాళ్లకి, ఎక్కువ వాలిడిటీ కోరుకునే వాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. కానీ టాక్ టైమ్ మాత్రం లేదు. రూ.99 డేటా ప్లాన్‌లో రెండు రోజుల పాటు అన్‌లిమిటెడ్ డేటా వస్తుంది. తక్కువ టైమ్‌లో కంటిన్యూగా ఇంటర్నెట్ కావాలనుకునే వాళ్లకి ఇది పర్ఫెక్ట్. కానీ ఇందులో టాక్ టైమ్ ఆప్షన్ లేదు.


Click it and Unblock the Notifications








