డేటాతోపాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే రీఛార్జ్ ప్లాన్‌లు.. లిస్ట్, పూర్తి ప్రయోజనాలు..!
ఎయిర్‌టెల్ ప్రస్తుతం దేశంలో రెండో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉంది. జియో తొలి స్థానంలో ఉంది. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం ఎయిర్‌టెల్ అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. అయితే ఇటీవల ఎయిర్‌టెల్ కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. ఇందులో డేటాతోపాటు ఓటీటీ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ఓటీటీల్లో జియోహాట్‌స్టార్ కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్- జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు (Airtel and jiohotstar plans) రూ.100 నుంచే ఈ ప్లాన్‌లు ప్రారంభం కానున్నాయి.
ఎయిర్‌టెల్ రూ.100 ప్లాన్
ఈ డేటా ప్యాక్‌తో (Airtel Rs100 Plan) ఎయిర్‌టెల్ యూజర్లు 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్, SMS లను అందించడం లేదు. అయితే ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 30 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.195 ప్లాన్
ఈ డేటా ప్లాన్‌లో (Airtel Rs195 Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు 15GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్ ప్రయోజనాలు, SMS లను అందించడం లేదు. యూజర్లు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మూడు నెలల వరకు ఉపయోగించుకోవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.451 ప్లాన్
ఈ ప్లాన్‌లో (Airtel Rs451 Plan) భాగంగా యూజర్లు ఏకంగా 50GB డేటాను పొందవచ్చు. 30 రోజుల వ్యాలిడిటీతో ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. మూడు నెలల వరకు ఉపయోగించుకోవచ్చు.
రూ.549 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్‌లో (Airtel Rs549 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 3GB 4G డేటాను పొందవచ్చు. 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీంతోపాటు 3 నెలల వ్యాలిడిటీ జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు ZEE5 ఓటీటీ ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షను పొందవచ్చు. దీంతోపాటు ఉచితంగా హాలోట్యూన్స్‌ను వినియోగించుకోవచ్చు.
రూ.1029 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్‌లో (Airtel Rs1029 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 3 నెలల వరకు ఉపయోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ Xstream యాప్‌ను కూడా వినిగించుకోవచ్చు. దీంతోపాటు ఉచితంగా హాలోట్యూన్స్‌ను పొందవచ్చు. మరియు అపోలో 24/7 సర్కిల్ ప్రయోజనాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications