Home
News

Airtel : ఎయిర్‌టెల్‌ షాకింగ్‌ నిర్ణయం.. పూర్తి వివరాలు..!

ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌ ఐడియా వంటి సంస్థలు గత సంవత్సరం మొబైల్‌ టారిఫ్‌ ధరలను భారీ పెంచాయి. ఈ సంవత్సరం కూడా మరోసారి రీఛార్జ్ ధరల పెంపు ఉంటుందని ఇటీవల లీక్స్‌ వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇటీవల కాలంలో ఎయిర్‌టెల్‌, BSNL వంటి సంస్థల కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

BSNL సంస్థ ఇటీవల కాలంలో అనేక రీఛార్జ్‌ ప్లాన్లలో అనేక మార్పులు చేసింది. ప్లాన్‌ల వ్యాలిడిటీ కుదింపు సహా డేటా ప్రయోజనాల్లో మార్పులు చేసింది. ధరలు పెంచమంటూనే, ప్లాన్‌ల ప్రయోజనాల్లో కోత విధించి, అందరికీ షాక్ ఇచ్చినంత పనిచేసింది.

Airtel

కీలక నిర్ణయం! :
మరో సంస్థ ఎయిర్‌టెల్‌ కూడా ఇటీవల కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత నెలలో కనిష్ఠ నెలవారీ రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.189 తొలగించింది. దీంతో నెలవారీ కనిష్ఠ ప్లాన్‌ కోసం రూ.199 ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా మరో రెండు రీఛార్జ్‌ ప్లాన్‌ లను తొలగించింది.

ఎయిర్‌టెల్ తాజాగా రూ.121, రూ.181 రీఛార్జ్‌ ప్లాన్‌లను తొలగించింది. టెలికాం టాక్‌ కథనం ద్వారా ఈ వివరాలు వెల్లడ‌య్యాయి. ఈ రెండు ప్లాన్‌ లు డేటా ప్లాన్‌లుగా ఉన్నాయి. 30 రోజుల వ్యాలిడిటీగా ఉండేది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌, యాప్‌ లో ఈ ప్లాన్‌లను తొలగించింది.

ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ రూ.100 రీఛార్జ్ ప్లాన్‌ లో 6GB డేటాను అందిస్తోంది. దీంతోపాటు ఎయిర్‌టెల్‌ Xstream ప్లే సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా పొందవచ్చు. ఇందులో 20 కి పైగా ఓటీటీ యాప్‌ సబ్‌స్క్రిప్షన్‌ లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ లో 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.

దీంతోపాటు ఎయిర్‌టెల్ యూజర్లు రూ.161 రీఛార్జ్‌ ప్లాన్‌ ను కూడా ఎంచుకోవచ్చు. ఇందులో భాగంగా 12GB డేటాను వినియోగించుకోవచ్చు. 30 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు రూ.195 రీఛార్జ్ ప్లాన్‌ ను కూడా ఎంచుకోవచ్చు. ఇందులో 12GB డేటాతోపాటు జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.

* రూ.279 రీఛార్జ్‌ ప్లా్న్‌లో భాగంగా యూజర్లు మొత్తంగా 1GB డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌, జియోహాట్‌స్టార్‌ సూపర్‌ సబ్‌స్క్రిప్షన్‌, Zee5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌, ఎయిర్‌టెల్‌ Xstream ప్లే సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. వీటితోపాటు SonyLIV సహా మరిన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంది.

* రూ.398 రీఛార్జ్‌ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను అందిస్తోంది. దీంతోపాటు రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. అయితే 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ ప్లాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లా్‌న్‌లో పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. హాలోట్యూన్స్‌ను ఉచితంగా పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel removed Rs121, Rs181 Recharge plans here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X