జియోని వదిలిపెట్టని ఎయిర్‌టెల్, కొత్త ఆఫర్లతో మళ్లీ కౌంటర్..

By Hazarath
|

దేశీయ టెలికాం దిగ్గజాల మధ్య టారిఫ్ వార్ రోజురోజుకు వేడెక్కిపోతోంది. ముఖ్యంగా జియో ఎయిర్‌టెల్ మధ్య టారిఫ్ వార్ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. జియో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఆఫర్లను రివైజ్ చేసిన కొద్ది నిమిషాలకే ఎయిర్‌టెల్ కూడా తన ఆఫర్లను సమీక్షించింది. చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్ల చెల్లుబాటును పొడిగిస్తూ అప్‌డేట్‌ చేసింది. రూ. 448, రూ.509 ప్రీపెయిడ్‌ రీచార్జ్‌లపై ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లు ఈ అదనపు డేటా ప్రయోజనాలను పొందనున్నారు.

 

జనవరి 9 నుంచి మారనున్న జియో ప్లాన్లు, లిస్ట్ ఇదే !జనవరి 9 నుంచి మారనున్న జియో ప్లాన్లు, లిస్ట్ ఇదే !

రూ.448 ప్లాన్‌

రూ.448 ప్లాన్‌

ఇంతకు ముందు 70 రోజులు ఉన్న వ్యాలిడిటీని ఇప్పుడు 82 రోజులకు పెరిగింది. అంటే రోజుకు 1 జిబి డేటా చొప్పున 84 రోజుల పాటు అందిస్తోంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, వింక్‌మ్యూజిక్ , ఎయిర్టెల్ టీవీ ఆప్‌ చందా వంటి ఇతర ప్రయోజనాలు ఈ పథకంలోనే లభిస్తాయి.

రూ. 509 ప్లాన్

రూ. 509 ప్లాన్

84 రోజుల బదులుగా ఇకపై 91 రోజులు పాటు ఈ ప్లాన్ చెల్లుతుంది. రోజుకు 1 జిబి డేటా చొప్పున 91 రోజులు పాటు ఎంజాయ్ చేయవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, వింక్‌మ్యూజిక్ , ఎయిర్టెల్ టీవీ ఆప్‌ చందా వంటి ఇతర ప్రయోజనాలు ఈ పథకంలోనే లభిస్తాయి.

జియో
 

జియో

కాగా జియో తన ప్లాన్లను సవరించిన సంగతి తెలిసిందే. సవరించిన ప్లాన్ల ప్రకారం రూ. 199 ప్యాక్ ఇప్పుడు రూ. 149కే పొందవచ్చు. అలాగే రూ.399 ప్యాక్ రూ.349కు, రూ.459 ప్యాక్ 399కు, రూ. 499 ప్లాన్ రూ.449కు లభిస్తున్నది.

jio plans

jio plans

రూ. 149 ప్లాన్ లో రోజుకు 1జిబి డేటా చొప్పున నెల రోజులు పొందవచ్చు. రూ.349 ప్లాన్ వాలిడిటీ 70 రోజులు, రూ.399 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు, రూ.449 ప్లాన్ 91 రోజుల వరకు వాలిడిటీని కలిగి ఉన్నాయి. వీటిల్లో రోజుకు 1జిబి డేటా లభిస్తుంది.

jio plans

jio plans

మరో ప్లాన్ రూ.299 ఇప్పుడు రూ.198కే లభిస్తోంది. ఇందులో 42 జిబి డేటాను రోజుకు 1.5 జిబి చొప్పున నెల రోజుల పాటు వాడుకోవచ్చు. దీంతోపాటు రూ.398 ప్లాన్ (105 జీబీ డేటా, 70 రోజుల వాలిడిటీ), రూ.448 ప్లాన్ (126 జీబీ డేటా, 84 రోజుల వాలిడిటీ), రూ.498 ప్లాన్ (136 జీబీ డేటా, 91 రోజుల వాలిడిటీ)లలోనూ రోజుకు 1.5 జీబీ డేటాను కస్టమర్లు వాడుకోవచ్చు.

Airtel మిగతా ప్లాన్లు

Airtel మిగతా ప్లాన్లు

అయితే జియో అన్ని ప్లాన్లను రివైజ్ చేయగా Airtel మాత్రం రెండు ప్లాన్లనే రివైజ్ చేసింది. మిగతా ప్లాన్లు ఎప్పుడు రివ్యూ చేస్తుందనే విషయంపై కంపెనీ ఇంకా సరైన స్పష్టతనివ్వలేదు. రివ్యూ చేసిన ప్లాన్లు Airtel వెబ్‌సైట్లో పొందుపరిచారు.

Best Mobiles in India

English summary
As Jio Readies to Slash Prices, Airtel Updates Rs. 448, Rs. 509 Plans More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X