Airtel రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంట్ అందుబాటులోకి వచ్చింది!! రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్...

|

భారతదేశంలో ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ తన చందాదారుల కోసం నేడు కొత్తగా 'రివార్డ్స్ 123' డిజిటల్ సేవింగ్స్ అకౌంటును అధికారికంగా ప్రారంభించింది. యూజర్లు ఇప్పుడు ఈ సేవింగ్స్ అకౌంటుతో దాదాపుగా రూ.960 విలువైన వార్షిక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ 'రివార్డ్స్ 123' అకౌంటును దేశంలోని ఏ ప్రాంతం నుండైనా ఎయిర్‌టెల్ థాంక్స్ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

ఆన్‌లైన్ లావాదేవీ

ఇందులో వినియోగదారులు వారు చేసే ప్రతి ఆన్‌లైన్ లావాదేవీల నుండి కొన్ని స్థిరమైన ప్రయోజనాలను పొందేలా దీనిని రూపొందించబడింది. వినియోగదారులు ప్రతి ఆన్‌లైన్ లావాదేవీల మీద క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వినియోగదారులు ఈ 'రివార్డ్స్ 123' అకౌంటును పొందాలంటే కనుక ఫీజును చెల్లించవలసి ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంట్ కాస్ట్

ఎయిర్టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంట్ కాస్ట్

ఎయిర్టెల్ 'రివార్డ్స్ 123' సేవింగ్స్ అకౌంట్ కు అప్‌గ్రేడ్ చేయడానికి వినియోగదారులు ప్రతి సంవత్సరం రూ.299 చెల్లించవలసి ఉంటుంది. దీనికి అప్‌గ్రేడ్ చేయడానికి వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ అప్లికేషన్ ద్వారా వీడియో KYC ని పూర్తి చేయాలి. అప్‌గ్రేడ్ చేసిన తర్వాత వినియోగదారులు క్రింద పేర్కొన్న అనేక ప్రయోజనాలకు యాక్సిస్ ను పొందుతారు.

ఎయిర్టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు

** ఎయిర్టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంట్ పొందిన తరువాత యూజర్లు UPI ఐడీ ద్వారా తమ అకౌంటుకు రూ.1,000 లోడ్ చేసినప్పుడు వారికి నెలకు రూ.10 వరకు అంటే 1% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇవే కాకుండా షాపింగ్ రివార్డులు కూడా ఉన్నాయి. యూజర్లు తమ ప్లాటినం డెబిట్ కార్డు ద్వారా రూ.1000 ఆన్‌లైన్ కొనుగోలుపై 2% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. షాపింగ్ కోసం నెలవారీ రివార్డ్ పరిమితి రూ.40 గా ఉంటుంది.


** పోస్ట్‌పెయిడ్, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ మరియు డిటిహెచ్ కనెక్షన్ యొక్క ఏదైనా చెల్లింపులపై వినియోగదారుడు ప్రతి నెలా రూ.30 వరకు ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

 

ఎయిర్‌టెల్ రివార్డ్స్ 123 అకౌంట్

ఎయిర్‌టెల్ రివార్డ్స్ 123 అకౌంట్ యొక్క ఇతర ప్రయోజనాలలో జీరో బ్యాలెన్స్ మరియు ఉచిత ప్లాటినం ఆన్‌లైన్ మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్ మరియు ఆటో-స్వీప్ సౌకర్యంతో పాటుగా అపరిమిత డిపాజిట్లు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ 'రివార్డ్స్ 123' సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ కొంతకాలంగా చురుకుగా ఉందని గమనించండి. అయితే టెల్కో తన రాకను అధికారికంగా ఈ రోజు మాత్రమే ప్రకటించింది. ఆన్‌లైన్ లావాదేవీలను అధికంగా చేసే ఎయిర్‌టెల్ వినియోగదారులు 'రివార్డ్స్ 123' సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ నుండి అధిక మొత్తంలో లబ్ది పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel Rewards123 Upgrade Savings Account Released in India: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X