Airtel నుంచి అత్యంత చవకైన డేటా ప్లాన్లు
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జియో వచ్చిన నాటి నుంచి టెలికాం పరిశ్రమలో ఓ కొత్త విప్లవం మొదలైందనే చెప్పవచ్చు. జియో ఉచిత డేటా ఆఫర్లు ప్రకట
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జియో వచ్చిన నాటి నుంచి టెలికాం పరిశ్రమలో ఓ కొత్త విప్లవం మొదలైందనే చెప్పవచ్చు. జియో ఉచిత డేటా ఆఫర్లు ప్రకటించిన నాటి నుంచి మిగతా టెల్కోలు కోట్ల నష్టాలను చవిచూశాయి. ఆ తరువాత అత్యంత తక్కువ ధరకే టారిఫ్ ధరలను ప్రవేశపెట్టిన జియో మిగతా టెల్కోలకు కొంచెం ఊరటనిచ్చింది.

దీంతో మిగతా టెల్కోలు కూడా జియోకు పోటీగా ఆఫర్లను ప్రకటిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే airtel జియోకు ధీటుగా మార్కెట్లో దూసుకుపోతోంది. అత్యంత తక్కువ ధరకే డేటా ధరలను ప్రవేశపెట్టింది.

రెండు డేటా ప్లాన్లే
దేశీయ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ తాజాగా తన సబ్‌స్క్రైబర్ల కోసం రెండు ప్రిపెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించింది. ఒకటి రూ.48 ప్లాన్. రెండోది రూ.98 ప్లాన్. ఇవి రెండు డేటా ప్లాన్లుగా మార్కెట్లోకి వచ్చాయి. అన్ని టెలికం సర్కిళ్లలోనూ ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

రూ. 48 ప్లాన్
ఎయిర్‌టెల్ 48 ప్లాన్ విషయానికి వస్తే.. రూ.48 రీచార్జ్ చేసుకోవాలి. 3 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులుగా ఉంది.

రూ. 98 ప్లాన్
అయితే 98 ప్లాన్‌తో కస్టమర్లకు 10 ఉచిత నేషనల్ ఎస్ఎంఎస్‌లు వస్తాయి. యూజర్లు రూ.98తో రీచార్జ్ చేసుకోవాలి. ఇందులో 6జీబీ డేటా లభిస్తుంది.

కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో
బడ్జెట్ మంత్లీ డేటా కోరుకునే వారికి ఈ రెండు ప్లాన్లు అనువుగా ఉంటాయి. ఇవి ఆల్ రౌండర్ ప్లాన్లు కాకపోవడం కొంత ప్రతికూల అంశంగా చెప్పవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్ల వివరాలు కనిపించకపోవచ్చు.

కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో
అత్యంత చవకైన డేటా ప్లాన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇవి చక్కని పరిష్కారమని ఎయిర్‌టెల్ పేర్కొంది. అలాగే, ఎక్కువగా డేటా ఉపయోగించని వారికి కూడా ఈ ప్యాక్‌లు చక్కగా సరిపోతాయని తెలిపింది. అయితే థర్డ్ పార్టీ రీచార్జ్ వెబ్‌సైట్స్‌లో ఈ ప్లాన్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








