Home
News

ఎయిర్‌టెల్ నుంచి సరికొత్త ప్లాన్, అదనపు డేటా

ఇండియాలో రెండవ అతి పెద్ద టెలికాం దిగ్గజంగా పేరు గాంచిన ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 398 ప్లాన్ ను విడుదల చేసింది.

ఇండియాలో రెండవ అతి పెద్ద టెలికాం దిగ్గజంగా పేరు గాంచిన ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 398 ప్లాన్ ను విడుదల చేసింది. ఈ ప్లాన్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో రూ. 398కి పోటీగా నిలవనుంది. ఈ రూ. 398 ప్లాన్ ద్వారా వినియోగదారులు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, 1.5 జిబి డేటాని యూజర్లు అందుకోనున్నారు.కాగా ఈ ప్లాన్లో ఎటువంటి FUP లిమిట్ లేదు.కాగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజలు వరకు ఉంటుంది. ఈ 70 రోజుల వ్యవధిలో వినియోగదారులు 105 జజిబి డేటాను అందుకుంటారు.

ఈ కొత్త ప్లాన్ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి ఉంది...

ఈ కొత్త ప్లాన్ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి ఉంది...

టెలికాం టాక్ రిపోర్టింగ్ ప్రకారం ఈ కొత్త ప్లాన్ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి ఉంది.దీంతో పాటు వినియోగదారులు రూ.399 ప్లాన్ ని కూడా పొందవచ్చు. దీని ద్వారా రోజుకు 1.4 జిబి డేటా, 100 ఎసెమ్మెస్ లును 84 రోజుల పాటు వాడుకునే వీలుంది.

రిలయన్స్ జియోలో...

రిలయన్స్ జియోలో...

కాగా ఇదే ప్లాన్ ప్రకారం రిలయన్స్ జియోలో రోజుకు 2జిబి డేటా, రోజుకు 100 ఎస్మెమ్మెస్ లు,అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. కాగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజుల వరకు ఉంటుంది.

 వొడాఫోన్ లో కూడా ఉంది....

వొడాఫోన్ లో కూడా ఉంది....

ఈ రకమైన ప్లాన్ వొడాఫోన్ లో కూడా ఉంది. ఇందులో రోజుకు 1.4 జిబి డేటా అన్ లిమిటెడ్ కాలింగ్తో పాటు డైలి కాల్స్ లిమిట్ 250 నిమిషాల వరకు ఉంటుంది.

 రూ.99 ప్లాన్ ....

రూ.99 ప్లాన్ ....

గత వారం ఈ కంపెనీ తన రూ.99 ప్లాన్ రివైజడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రూ.99 ప్లాన్ ను 119 ప్లాన్ గా మార్చింది. దీని ద్వారా యూజర్లు నెల రోజులు పాటు 2జిబి డేటా అన్ లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్మెస్లు అందుకుంటారు.

రిలయన్స్ జియోతో పోలిస్తే భారతీ ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ వేగం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది....

రిలయన్స్ జియోతో పోలిస్తే భారతీ ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ వేగం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది....

ఇదిలా ఉంటే రిలయన్స్ జియోతో పోలిస్తే భారతీ ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ వేగం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ దేశంలో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 4జీ నెట్‌వర్క్‌తో పాటు 3జీలోనూ ఎయిర్‌టెల్ టాప్‌లో నిలిచింది.

 

 

అప్‌లోడ్ స్పీడ్‌లో ఐడియా తొలి స్థానం...

అప్‌లోడ్ స్పీడ్‌లో ఐడియా తొలి స్థానం...

అప్‌లోడ్ స్పీడ్‌లో ఐడియా తొలి స్థానం సంపాదించినట్లు తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 22 సర్కిళ్లలో 4జీ నెట్‌వర్క్ కవరేజ్ పరంగా చూస్తే రిలయన్స్ జియో టాప్‌లో ఉందని మొబైల్ అనలిటిక్స్ కంపెనీ ఓపెన్ సిగ్నల్ తాజా నివేదికలో వెల్లడించింది.

ఎయిర్‌టెల్ తర్వాతి స్థానంలో జియో...

ఎయిర్‌టెల్ తర్వాతి స్థానంలో జియో...

జూన్ 11 నుంచి ఆగస్టు 29 మధ్యకాలంలో పరీక్షలు నిర్వహించగా డౌన్‌లోడ్ స్పీడ్‌లో ఓవరాల్‌గా ఎయిర్‌టెల్ తర్వాతి స్థానంలో జియో, వొడాఫోన్, ఐడియా, భారత ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఉన్నాయని సంస్థ పేర్కొంది.

 

 

4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియోనే ఫాస్టెస్ట్ నెట్‌వర్క్....

4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియోనే ఫాస్టెస్ట్ నెట్‌వర్క్....

టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ మాత్రం 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియోనే ఫాస్టెస్ట్ నెట్‌వర్క్ అని ప్రకటిస్తుండటం గమనార్హం. దేశవ్యాప్తంగా 1.7 మిలియన్ డివైస్‌లను పరీక్షించి ఈ డేటాను సేకరించారు.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel rolls out Rs 398 prepaid plan.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X