ఎయిర్‌టెల్ దూకుడు : రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు లాంచ్
దేశీయ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రెండు నూతన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ కస్టమర్లకోసం ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లతో ముందుకు వచ్చింది .
దేశీయ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రెండు నూతన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ కస్టమర్లకోసం ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లతో ముందుకు వచ్చింది . టెలికాం కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం భారతీ ఎయిర్‌టెల్ రెండు ప్లాన్లను లాంచ్ చేసింది. వాటిల్లో ఒకటి రూ.100 ప్లాన్ కాగా, రెండవది రూ. 500 ప్లాన్. ఈ ప్లాన్లను మై ఎయిర్‌టెల్ యాప్‌లో కూడా రీచార్జి చేసుకోవచ్చు.

రూ.100
రూ.100 రీచార్జి చేసుకున్న ఎయిర్‌టెల్ కస్టమర్ కి రూ.81.75 టాక్ టైం లభిస్తుంది. ఇందులో ఇన్‌కమింగ్ కాల్స్‌కు లైఫ్ టైం వాలిడిటీని అందిస్తున్నారు.ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే.

రూ.500
రూ.500 రీచార్జి చేసుకున్న ఎయిర్‌టెల్ కస్టమర్ కి రూ.420.73 టాక్ టైం లభిస్తుంది. ఇందులో ఇన్‌కమింగ్ కాల్స్‌కు లైఫ్ టైం వాలిడిటీని అందిస్తున్నారు.ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు మాత్రమే.

ఎయిర్‌టెల్ గత వారంలో మూడు కొత్త ప్లానలను లాంచ్ చేసింది...
రూ.998 ప్లాన్....
ఈ రీఛార్జ్ ప్లాన్ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 336 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, నెలకు 300 ఎస్‌ఎంఎస్‌లు, 12 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు .

రూ. 597 ప్లాన్...
ఈ రీఛార్జ్ ప్లాన్ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 168 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, నెలకు 300 ఎస్‌ఎంఎస్‌లు, 6 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు

రూ.1,699 ప్లాన్
365 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,699 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజు 100 ఎస్సెమ్మెస్‌లు, 1జీబీ డేటాను వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








