Airtel డబుల్ డేటా ఆఫర్,జియో రూ.198కి కౌంటర్
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకి కౌంటర్‍గా Airtel సరికొత్త ప్లాన్‌తో దూసుకొచ్చింది.
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకి కౌంటర్‍గా Airtel సరికొత్త ప్లాన్‌తో దూసుకొచ్చింది. రిలయన్స్ జియో ఇస్తున్న గట్టిపోటీని తట్టుకునేందుకు ఎప్పటికపుడు వ్యూహాలను మార్చుకుంటూ వెళుతున్న Airtel తాజాగా తన రీచార్జ్‌ప్లాన్ మళ్లీ సవరించింది. రూ.149 ప్రీపెయిడ్ ప్యాక్‌పై వినియోగదారులకు డబుల్ డేటా ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా జియో రూ.198 ప్లాన్‌కు కౌంటర్‌గా అదనపు ప్రయోజనాలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రణాళికలో భాగంగా ఎయిర్‌టెల్ ఆ సవరణ చేసింది.

రూ.149ల ప్రీపెయిడ్ ప్లాన్‌పై
ఎయిర్‌టెల్ రూ.149ల ప్రీపెయిడ్ ప్లాన్‌పై ఇపుడు 2జీబీ 2జీబీ/3జీబీడేటాను ఆఫర్ చేస్తోంది. ఇప్పటివరకూ 1 జీబీ మాత్రమే అందిస్తుండగా తాజా నిర్ణయంతో డబుల్ ధమాకాడేటా ఆఫర్‌ను ప్రకటించింది.

వాలిడిటీ 28రోజులు
కాగా ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులుగా నిర్ణయించారు. రూ. 2.68కు జీబీ డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటాను కస్టమర్లకు అందివ్వనుందన్నమాట. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

జియో రూ.198 ప్యాక్‌లో
అయితే పరిమితమైన చందాదారులకు మాత్రమే అందుబాటు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా రిలయన్స్ జియో రూ.198 ప్యాక్‌లో 28రోజుల వాలిడిటీతో రోజుకు 1.5జీబీ చొప్పున 42 జీబీ డేటాను అందిస్తోంది.

రూ.399 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్
గత నెలలోనే రూ.399 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను సవరించిన ఎయిర్‌టెల్ 1.4జీబీ బదుకుగా 2.4జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త ప్లాన్ తో జియోకి నిజంగానే షాక్ ఇవ్వబోతున్నట్లు టెలికం వర్గాలు చెబుతున్నాయి.

రూ.299కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్
భారతీ ఎయిర్‌టెల్ రూ.299కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ వస్తాయి. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 45 రోజులుగా ఉంది.

ఫీచర్ ఫోన్ యూజర్లకు మాత్రమే
అయితే ఈ ప్లాన్‌లో కస్టమర్లకు ఎలాంటి డేటా లభించదు. కేవలం ఫీచర్ ఫోన్ యూజర్లకు మాత్రమే పనికొచ్చేలా ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చారు. మరో వైపు జియోలో రూ.299 ప్లాన్‌కు రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తున్నారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.

అత్యధిక మొబైల్ కస్టమర్లు ఎయిర్‌టెల్‌కే..
సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో ఎయిర్‌టెల్‌కు మొత్తం 308.6 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఏప్రిల్ నెలలో కొత్తగా 45 లక్షల మంది వచ్చి చేరారు. ఇప్పుడు అత్యధిక మొబైల్ కస్టమర్లు ఎయిర్‌టెల్‌కే ఉన్నారు. మరోవైపు మార్కెట్ షేర్‌లోనూ ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications








