Home
News

ఉచితంగా Netflix ను అందించే ఎయిర్‌టెల్‌ ప్లాన్‌.. తొలిసారిగా అందుబాటులోకి..!

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ ( Airtel New Recharge Plans ) కీలక ప్రకటన చేసింది. నూతనంగా ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల ద్వారా కాంప్లిమెంటరీగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌తో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ ( Airtel Netflix Recharge plan ) తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పటి వరకు ఈ రెండింటిలోనే.. : ఇప్పటి వరకు ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌, Xstream ఫైబర్‌ ప్లాన్లలో మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌ అందుబాటులో ( Netflix subscription ) ఉంది. అయితే ఇందుకు ఎటువంటి అదనపు రుసుం లేదని తెలుస్తోంది. తాజాగా ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రూ.1499 ప్లాన్‌ను తీసుకొచ్చింది.

airtel netflix subscription

దేశవ్యాప్తంగా అందుబాటులోకి.. : ప్రస్తుతం ఈ ప్లాన్ ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌లో లిస్ట్‌ అయింది. దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ వినియోగదారులు ఈ ప్లా్న్‌ అందుబాటులోకి వచ్చింది. ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్, థ్యాంక్స్‌ యాప్‌ మరియు ఇతర రీఛార్జ్‌ ఫ్లాట్‌ఫాంలలో ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్ అందుబాటులో ఉంది.

ఎయిర్‌టెల్‌ రూ. 1499 నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ వివరాలు : ఈ ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌, రోజుకు 100 SMSలు మరియు 3GB డేటా మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ప్రయోజనాలు అయిన అపోలో 24/7 సర్కిల్‌, ప్రీ హాలోట్యూన్స్‌ మరియు వింక్‌ మ్యూజిక్‌ యాప్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

airtel netflix subscription

అన్‌లిమిటెడ్‌ డేటా ప్లాన్‌ : ప్లాన్‌లోని హైస్పీడ్‌ డేటాను పూర్తిగా వినియోగించుకున్న తర్వాత 64kbps వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు. రోజవారి SMS లు 100 వినియోగించిన తర్వాత లోకల్‌ ఎస్‌ఎంఎస్‌ పంపేందుకు రూ.1 మరియు STD ఎస్‌ఎంఎస్‌ పంపేందుకు రూ.1.5 చెల్లించాల్సి ఉంటుంది.

జియోలో ఇప్పటికే రెండు ప్లాన్లు.. : జియో ఇప్పటికే ఇటువంటి ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో రూ.1099 ప్లాన్‌తో రోజుకు 2GB డేటాను పొందుతారు. మరియు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సదుపాయం ఉంది. వీటితోపాటు నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్కప్షన్‌ను పొందుతారు. 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వాలిడిటీ 84 రోజులపాటు ఉంది.

మరో జియో ప్లాన్‌ రూ.1499తో రోజుకు 3GB డేటాను పొందుతారు. మరియు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందిస్తుంది. మరియు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సదుపాయం ఉంది. ప్రస్తుతం జియోలో ఈ రెండు ప్లాన్‌లు మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులో ఉన్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Airtel rs 1499 Recharge plan comes with free netflix subscription plan full benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X