ఎయిర్‌టెల్ రూ.168 ప్లాన్‌తో లాభాలెన్నో..
ప్రయివేటురంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) సరికొత్త ప్రీ-పెయిడ్ కాంబో రీఛార్జ్ ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.
ప్రయివేటురంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) సరికొత్త ప్రీ-పెయిడ్ కాంబో రీఛార్జ్ ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ప్లాన్ ఖరీదు రూ.168. 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోన్న ఈ ప్లాన్‌లో భాగంగా వాయిస్, ఎస్ఎంఎస్ ఇంకా డేటా బెనిఫిట్స్ యూజర్స్‌కు అందుబాటులో ఉంటాయి. హల్లో ట్యూన్ సబ్‌స్ర్కిప్షన్ కూడా ఈ ప్లాన్‌తో లభిస్తుంది.

కొద్ది రోజుల క్రితమే రూ.97 కాంబో రీఛార్జ్ ప్లాన్..
కొద్ది రోజుల క్రితమే జియోకు పోటీగా రూ.97 కాంబో రీఛార్జ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోన్న ఈ ప్లాన్‌లో 1.5జీబి డేటాతో
పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ ఇంకా ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ను ఎయిర్‌టెల్ అందిస్తోంది. తాజాగా తీసుకుచ్చిన రూ.168 ప్లాన్‌ను, వొడాఫోన్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన రూ.159 ప్రీపెయిడ్ ప్లాన్‌కు పోటీగా భావిస్తున్నారు.

ఎయిర్‌టెల్ రూ.168 ప్లాన ప్రత్యేకతలు..
ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన రూ.168 ప్రీ-పెయిడ్ కాంబో రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా 28 రోజుల పాటు అపరిమితంగా కాల్స్ చేసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో రోజుకు 1జీబి 2జీ/3జీ/4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రోజుకు 100 మెసేజెస్ వరకు పంపుకోవచ్చు. ఇక హల్లో ట్యూన్ సబ్‌స్ర్కిప్షన్ విషయానికి వచ్చేసరికి రీఛార్జ్ చేసిన 4 గంటల్లోపు డీఫాల్ట్‌గా యూజుర్ అకౌంట్‌లో యాక్టివేట్ అవుతుంది హల్లో ట్యూన్ సబ్‌స్ర్కిప్షన్ యాక్టివేట్ అయిన తరువాత యూజర్ తనకు కావల్సిన ట్యూన్‌కు మారిపోవచ్చు. టెలికం టాక్ రిపోర్ట్ ప్రకారం ఈ ప్లాన్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా ఢిల్లీ సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

వొడాఫోన్ రూ.159 ప్లాన్ ప్రత్యేకతలు..
వొడాఫోన్ లాంచ్ చేసిన రూ.159 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోంది. ప్లాన్ పిరియడ్‌లో భాగంగా రోజుకు 1జీబి 2జీ/3జీ/4జీ డేటాతో పాటు 250 నిమిషాల వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు.

ఎయిర్‌టెల్ ఇతర ప్లాన్స్..
రూ.168, రూ.97 ప్లాన్‌లతో పాటు రూ.419 ప్లాన్‌ను కూడా ఈ మధ్యనే అందుబాటులోకి తీసుకువచ్చింది. 75 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోన్న ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1.4జీబి 2జీ/3జీ/4జీ డేటాతో పాటు వారానికి 1000 నిమిషాల కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో రోజుకు 100 వరకు ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను కూడా యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఈ ప్లాన్‌లను సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలనుకుంటోన్న ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ అయి ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








