వోడాఫోన్ కి పోటీగా 168 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్
దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు టారిప్ వార్ మరింతగా వేడెక్కుతోంది. ముఖ్యంగా ఎయిర్టెల్ ఇతర దిగ్గజ టెలికాం సంస్థలతో నువ్వా నేనా అంటూ ఢీకొంటోంది.
దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు టారిప్ వార్ మరింతగా వేడెక్కుతోంది. ముఖ్యంగా ఎయిర్టెల్ ఇతర దిగ్గజ టెలికాం సంస్థలతో నువ్వా నేనా అంటూ ఢీకొంటోంది.కొద్ది వారాల క్రితం టెలికాం దిగ్గజం వోడాఫోన్ సంస్థ 159 రూపాయలు ప్రీపెయిడ్ ప్లాన్ మార్కెట్లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దానికి పోటీగా తాజాగా ఎయిర్టెల్ సంస్థ 168 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.ఈ ప్లాన్ ద్వారా వాయిస్ కాలింగ్, మొబైల్ డేటా, SMS, హలో ట్యూన్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ,ఢిల్లీ, టెలికం సర్కిళ్లలో మాత్రమే ఈ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. దేశంలోని ఇతర టెలికం సర్కిళ్లకు త్వరలో లభించబోతుంది.

28 రోజుల వేలిడిటీ కలిగిన ఈ ప్లాన్....
ఈ ప్లాన్ త్వరగా లభించే ప్రయోజనాలు చూస్తే 28 రోజుల వేలిడిటీ కలిగిన ఈ ప్లాన్ ద్వారా అపరిమితమైన లోకల్, ఎస్.టి.డి, నేషనల్ రోమింగ్ వాయిస్ కాల్స్ అందించబడతాయి. గరిష్ట ఫోన్ కాల్స్ విషయంలో ఎలాంటి పరిమితి లేదు. ఒకప్పుడు Airtel అందించే ఉచిత వాయిస్ కాల్స్‌కి రోజువారీ, వారం మొత్తానికి గరిష్టమైన పరిమితి ఉండేది. అయితే రిలయన్స్ జియో తో పోటీగా నిలవడం కోసం Airtel వాయిస్ కాల్స్ విషయంలో ఫెయిర్ యూసేజ్ పరిమితులను ఎత్తేసింది.

వాయిస్ కాల్స్ తో పాటు....
వాయిస్ కాల్స్ తో పాటు 28 రోజుల పాటు రోజుకి 1GB చొప్పున మొబైల్ డేటా లభిస్తుంది. అంటే ప్లాన్ పిరియడ్ మొత్తానికీ కలిపి 28GB మొబైల్ డేటా లభిస్తుందన్న మాట. అలాగే రోజుకు 100 చొప్పున మొత్తం 2800 ఎస్ ఎం ఎస్ లు లభిస్తాయి. వీటితోపాటు, మీకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వారికి వినిపించబడేలా మీకు నచ్చిన Hello Tuneని ఎంపిక చేసుకొని దాన్ని సబ్స్క్రిప్షన్ 28 రోజుల పాటు పొందవచ్చు.

వోడాఫోన్ అందిస్తున్న 159 రూపాయల ప్లాన్....
వోడాఫోన్ అందిస్తున్న 159 రూపాయల ప్లాన్ తో పోలిస్తే ఎయిర్టెల్ లో ఉన్న ఉన్న అదనపు ప్రయోజనం వాయిస్ కాల్స్ విషయంలో ఎలాంటి పరిమితి లేకపోవడం!వోడాఫోన్ రోజుకి గరిష్టంగా 250 నిమిషాలు మాత్రమే, అలాగే వారం మొత్తానికీ కలిపి 1000 నిమిషాలు మాత్రమే వాయిస్ కాల్స్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.

ఈ వారంలో ఎయిర్టెల్ ప్రారంభించిన మరి కొన్ని ప్లాన్స్....
ఈ ప్లాన్స్ ఎయిర్టెల్ నెట్వర్క్‌లో కొత్తగా జాయిన్ అయ్యే వారికి మాత్రమే వర్తిస్తాయి
FRC 178...
FRC 178 రీఛార్జి ద్వారా 28 రోజుల పాటు రోజుకి 1GB చొప్పున మొబైల్ డేటా తో పాటు అపరిమితమైన లోకల్, ఎస్.టి.డి, రోమింగ్ కాల్స్, ప్రతీరోజూ 100 SMSలు ఇవ్వబడతాయి.
FRC 229...
FRC 229 రీఛార్జి ద్వారా 28 రోజుల పాటు రోజుకి 1.4 GB మొబైల్ డేటా, అపరిమితమైన కాల్స్, రోజుకి 100 SMSలు లభిస్తాయి.
FRC 344....
FRC 344 రూపాయల ఫస్ట్ రీఛార్జ్ విషయానికొస్తే, 28 రోజుల పాటు రోజుకి 2GB మొబైల్ డేటా తో పాటు అపరిమితమైన కాల్స్, రోజుకి 100 SMSలు ఇవ్వబడతాయి .
FRC 495....
FRC 495 రీఛార్జి ద్వారా రోజుకి 1.4 GB మొబైల్ డేటా తో పాటు, అపరిమితమైన లోకల్, ఎస్.టి.డి, రోమింగ్ కాల్స్ తో పాటు, రోజుకి 100 చొప్పున SMSలు వరుసగా 84 రోజుల పాటు ఇవ్వబడతాయి.
FRC 559.....
FRC 559 రీఛార్జి ద్వారా రోజుకి 1.4 GB మొబైల్ డేటా తో పాటు, అపరిమితమైన లోకల్, ఎస్.టి.డి, రోమింగ్ కాల్స్ తో పాటు, రోజుకి 100 చొప్పున SMSలు 90 రోజుల పాటు ఇవ్వబడతాయి.


Click it and Unblock the Notifications








