Home
News

RS.2 లక్షల జీవిత బీమాను RS.179 ప్లాన్‌తో ఉచితంగా అందిస్తున్న ఎయిర్‌టెల్

ఇండియాలో మొత్తం మీద 22 టెలికాం సర్కిల్‌లలో భారతి ఎయిర్‌టెల్ కొత్తగా సరసమైన ధర వద్ద రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ప్రాథమికంగా టెల్కో ప్రస్తుతం అందిస్తున్న రూ.149 ప్లాన్, రూ.179 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు జీవిత బీమా కవర్‌తో అందిస్తోంది. ఎయిర్‌టెల్ ఇప్పటికే రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రోజువారీ డేటా బెనిఫిట్ మరియు రూ .4 లక్షల జీవిత బీమా కవర్‌తో పాటుగా 28 రోజుల వాలిడిటీతో అందిస్తుంది.

ఎయిర్‌టెల్

కొత్తగా ప్రారంభించిన రూ.179 ప్లాన్ కూడా 28 రోజుల చెల్లుబాటుతో పాటు అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీనికి రోజువారీ డేటా ప్రయోజనం మాత్రం లేదు. భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ నుండి ఈ రూ .2 లక్షల జీవిత బీమా కవర్ ఇవ్వబడుతోంది. డిసెంబరులో ధరల పెరుగుదలకు ముందు ఎయిర్‌టెల్ రూ.249 మరియు రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్‌ల మీద జీవిత బీమాను అందించేది. అయితే ఇప్పుడు అదే ప్రయోజనాన్ని రూ.279 మరియు రూ .179 ప్రీపెయిడ్ ప్లాన్‌లకు కూడా అందిస్తోంది. రాబోయే రోజుల్లో ఎయిర్‌టెల్ లాంగ్-వాలిడిటీ ప్లాన్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్‌లను కూడా అందివ్వనున్నది.

 

 

రూ.2 లక్షల జీవిత బీమాను అందిస్తున్న ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రూ.2 లక్షల జీవిత బీమాను అందిస్తున్న ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంబించంచడంలో ముందు ఉంటుంది. రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించిన తరువాత ఎయిర్‌టెల్ ఇప్పుడు సరసమైన మరొక రూ.179 ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇది ప్రాథమికంగా అదనపు జీవిత బీమాతో పాటు రూ.149 ప్లాన్ అందిస్తున్న అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. భారతి ఎయిర్‌టెల్ నుండి వచ్చిన కొత్త ప్రీపెయిడ్ బండిల్ భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్, 2GB 4G/ 3 జి / 2 జి డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లతో పాటు భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ నుండి రూ .2 లక్షల టర్మ్ లైఫ్ కవర్‌ను అందిస్తుంది. ఈ ప్యాక్ యొక్క చెల్లుబాటు కాలం 28 రోజులు.

 

 

ఎయిర్‌టెల్ రూ.179 ప్లాన్

టెల్కో ప్రకారం రూ.179 ప్లాన్ ప్రాథమిక భీమా కవరేజీని మరింత యాక్సిస్ మరియు సరసమైన టెలికాం సేవలతో పాటుగా మార్చడంలో కొత్త బెంచ్ మార్కును నిర్దేశిస్తుంది. ఈ ప్యాక్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మరియు సెమీ అర్బన్ మరియు గ్రామీణ మార్కెట్లలో ఫోన్ వినియోగదారులకు సేవలు అందించడానికి రూపొందించబడింది అని భారతి ఎయిర్‌టెల్ తెలిపారు.

 

 

ఎయిర్టెల్ భీమా

భారతదేశంలో భీమా వినియోగం 4% కన్నా తక్కువగా ఉందని IRDAI తెలిపింది. కాబట్టి ఎయిర్టెల్ తన వినియోగదారులకు బీమా సేవలను పొందటానికి అవకాశాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 18-54 సంవత్సరాల వయస్సు గల వినియోగదారులందరికీ బీమా అందుబాటులో ఉంటుంది. పాలసీ లేదా సర్టిఫికేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ రీఛార్జ్ చేసిన వెంటనే డిజిటల్‌గా పంపిణీ చేయబడుతుంది. ఒకవేళ మీకు హార్డ్ కావాలి అనుకుంటే అభ్యర్థన ద్వారా పొందవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ డిజిటల్ గా ఎయిర్‌టెల్ రిటైల్ దుకాణంలో లేదా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లో కొన్ని నిమిషాల వ్యవధిలో పొందవచ్చు.

 

 

భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ విభాగం

భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ విభాగం

గత సంవత్సరం భారతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ విభాగంలో విభిన్న సమర్పణలతో అందరి కంటే కాస్త భిన్నంగా ఉండేది. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా మరియు బిఎస్ఎన్ఎల్ వంటి టెల్కోలు వీలైనన్ని ఎక్కువ ప్లాన్ లను అందించడంపై దృష్టి సారిస్తుండగా భారతి ఎయిర్టెల్ ప్రీపెయిడ్ టారిఫ్ జాబితాను సరళంగా మరియు ప్రభావవంతంగా ఉంచింది. ఉదాహరణకు ఎయిర్‌టెల్ ఈ నెల మొదట్లో రూ.4 లక్షల జీవిత బీమా కవర్‌తో పాటుగా టెలికం సేవలతో రోజుకు 1.5 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటుతో అందించే రూ.279 ప్లాన్ ను ప్రారంభించింది.

రూ.349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

అదేవిధంగా టెల్కోలో మరొక రూ.349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. ఇది వినియోగదారులకు అదనపు ఖర్చు లేకుండా రూ .129 విలువైన అమెజాన్ ప్రైమ్ చందాను ఉచితంగా అందిస్తుంది. పరిశ్రమలోని ఇతర టెలికాం ఆపరేటర్లు ప్రస్తుతం ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని అందించడం లేదు కాబట్టి ఇది ఎయిర్‌టెల్ కస్టమర్లకు మంచి విషయం.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Rs.179 Plan Now Offers Free life insurance of RS.2 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X