Home
News

ఎయిర్‌టెల్ బంపరాఫర్.. రూ.211కే 30 రోజుల వ్యాలిడిటీ.. డైలీ 1GB డేటా...

Airtel: దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ రకరకాల ప్రీపెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్స్‌లో మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. కాలింగ్ కోసం, డేటా కోసం, ఓటీటీ (OTT) యాప్స్ చూడటానికి... మీ అవసరానికి తగ్గ ప్లాన్‌ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే రీసెంట్‌గా ఎయిర్‌టెల్ కేవలం రూ.211కే 30 రోజుల వ్యాలిడిటీ అందించడమే కాకుండా డైలీ 1 జీబీ డేటా అని ప్రకటించి ఆశ్చర్యపరిచింది.

నిజానికి గతంలో రోజుకి 1GB డేటా కావాలంటే చాలా డబ్బులు పెట్టాల్సి వచ్చేది. రూ.250లోపు అయితే అస్సలు వచ్చేది కాదు. 1GB, 1.5GB, 2GB డేటా ప్లాన్స్ కావాలంటే కనీసం రూ.250 పైన ఖర్చు చేయాల్సిందే. రూ.250 దాటినా సరే, 30 రోజుల వ్యాలిడిటీ కూడా గ్యారంటీ లేదు.

Airtel Rs 211 Plan Offers 1GB Daily Data with 30-Day Validity

ఇంకా ఇప్పుడు రేట్లు పెంచేశారు కదా, ప్లాన్స్ మరింత భారం అయిపోయాయి. కొన్ని చోట్ల ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సరిగా రాకపోవడం ఇంకో సమస్య. దీంతో నెట్ బాగా వాడేవాళ్లు నెలకు దాదాపు రూ.300 పైగా ఖర్చు పెట్టక తప్పట్లేదు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్లందరికీ గుడ్ న్యూస్.

6 రూ.211 ప్లాన్

ప్రతినెలా వందలు ఆదా చేసుకోవడానికి ఒక సూపర్ ప్లాన్ వచ్చేసింది. అదే ఎయిర్‌టెల్ రూ.211 ప్లాన్. ఇందులో రోజుకి 1GB డేటా ఇస్తారు. అది కూడా ఏకంగా 30 రోజుల పాటు. రోజూ బ్రౌజింగ్, సినిమాలు, వీడియోలు చూసేవాళ్లకి ఇది నిజంగా బెస్ట్ ఆప్షన్. డేటా అయిపోతుందనే టెన్షన్ లేకుండా హాయిగా వాడుకోవచ్చు.

కానీ ఈ ప్లాన్ బెనిఫిట్స్ పొందాలంటే కచ్చితంగా ఏదో ఒక బేస్ ప్లాన్ యాక్టివేట్ చేసుకొని ఉండాలి. ఒకవేళ ఈ ఆఫర్ మీకు భారంగా అనిపిస్తే ఎయిర్‌టెల్ మరిన్ని డేటా ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ సైతం ఆఫర్ చేస్తోంది. అవేవో తెలుసుకుందాం.

ఇతర ప్లాన్స్

రూ.121 ప్లాన్‌లో మీకు మొత్తం 6GB 4G డేటా వస్తుంది. వ్యాలిడిటీ 30 రోజులు. మీ రెగ్యులర్ ప్లాన్‌కి అదనంగా డేటా కావాలంటే ఇది సూపర్ ఆప్షన్. రూ.161 ప్లాన్‌తో 30 రోజుల పాటు 12GB మొబైల్ డేటా ఎంజాయ్ చేయొచ్చు. మరీ ఎక్కువ డేటా వాడకుండా, ఎక్స్‌ట్రా డేటా కావాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్.

మీ మెయిన్ ప్లాన్ మార్చకుండానే దీన్ని యాడ్ చేసుకోవచ్చు. రూ.181 రీఛార్జ్ ప్యాక్‌తో 15GB టోటల్ మొబైల్ డేటా వస్తుంది. అంతేకాదు, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీ. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 30 రోజులే.

బేస్ ప్లాన్ ప్లస్ కళ్లు చెదిరే డేటా

మరో ప్లాన్ అయిన రూ.219 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3GB టోటల్ డేటా, 300 SMSలు ఉన్నాయి. ఇంకా రూ.5 టాక్ టైమ్‌, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం యాక్సెస్ కూడా వస్తుంది. దీనికి బేస్ ప్లాన్ అవసరం లేదు. జస్ట్ 219కే నెల అంతా అన్ని బెనిఫిట్స్ అందుకోవచ్చు.

రూ.355 ప్లాన్

ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, 25GB టోటల్ డేటా, రోజుకి 100 SMSలు. అంతే కాదు, ఫ్రీ హెలోట్యూన్స్, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, 3 నెలల అపోలో సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీగా వస్తాయి. ఈ ప్లాన్ కూడా 30 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంది. రూ.361 ప్లాన్‌లో మీకు ఏకంగా 50GB మొబైల్ డేటా వస్తుంది.

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

రూ.599 బ్రాడ్‌బ్యాండ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అందరికీ కాదు, కొన్ని ఏరియాల్లోనే ఉంది. ఇందులో 30 Mbps వరకు స్పీడ్ ఉంటుంది. డేటా లిమిట్ నెలకి 3.3TB. ఇంకా 350+ టీవీ ఛానల్స్ కూడా చూడొచ్చు. సెట్-టాప్ బాక్స్ (STB) కూడా ఇస్తారు, కానీ సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి.

ఓటీటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ZEE5, డిస్నీ+ హాట్‌స్టార్, ఇంకా 25+ సర్వీసులు ఫ్రీ. మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే, ఇన్స్టాలేషన్ ఛార్జీలు కూడా ఉండవు. ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్, ఎయిర్‌ఫైబర్ రెండూ ఉన్న ఏరియాల్లో ఫైబర్ తీసుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఫైబర్ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel's Rs 211 plan offers 1GB daily data for 30 days, ideal for consistent browsing and streaming users seeking affordable data.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X