ఎయిర్‌టెల్ ప్లాన్లలో మార్పు, డేటా పరిమితి పెంపు !

Written By:

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ తన ప్లాన్లలో మార్పులను చేసింది. జియో నుంచి వస్తున్నఈ పోటీని తట్టుకునేందుకు Airtel ఈ సరికొత్త ఎత్తుగడకు తెరలేపింది. మారిన ప్లాన్ల ప్రకారం ఎయిర్‌టెల్‌ తన రోజు వారి ప్లాన్ల మీద డేటా పరిమితిని మరింతగా పెంచింది.

ఉచిత సేవలతో దూసుకుపోతున్న వాట్సప్‌కు రెవిన్యూ మార్గాలు ఇవే ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

500 ఎంబీ మేర..

ఎయిర్‌టెల్‌ రూ.349, రూ.549 ప్లాన్లలో రోజు వారీ లభించే డేటా లిమిట్‌ను 500 ఎంబీ మేర పెంచింది. ఇతర ఉచితాలతో పాటు రోజుకు అదనంగా 500 ఎంబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ 28 రోజులుగా ఉంది.

రోజుకు 1.5 జీబీ కాకుండా 2జీబీ డేటా..

అప్‌డేట్‌ చేసిన రూ.349 ప్లాన్ ద్వారా ఇప్పుడు రోజుకు 1.5 జీబీ కాకుండా 2జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.549 ప్లాన్‌లో ఇప్పటి వరకు రోజూ 2.5 జీబీ డేటా లభించగా ఇకపై రోజూ 3జీబీ డేటా లభ్యం కానుంది.

సెప్టెంబర్‌లో రూ.349 ప్లాన్‌ లాంచ్‌

రూ.349 ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ సెప్టెంబర్‌లో లాంచ్‌ చేసింది. తొలుత ఈ ప్లాన్‌ను లాంచ్‌ చేసినప్పుడు, అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు రోజుకు 1జీబీ డేటా అందించింది. తర్వాత నవంబర్‌లో డేటా పరిమితిని 1.5జీబీకి పెంచింది. ప్రస్తుతం ఈ పరిమితిని 2జీబీకి పెంచేసింది. దీంతో మొత్తంగా కస్లమర్లు 56జీబీ డేటా పొందనున్నారు.

రూ.549 ప్లాన్‌పై కూడా రోజువారీ డేటా

అదేవిధంగా రూ.549 ప్లాన్‌పై కూడా రోజువారీ డేటా పరిమితిని 2.5జీబీ నుంచి 3జీబీకి పెంచింది. డేటాతో పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు, రోమింగ్‌పై ఉచితంగా అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ను 28 రోజుల పాటు అందిస్తోంది. ఈ పెంపుతో మొత్తంగా 84జీబీ డేటాను ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్లు పొందుతారు.

వొడాఫోన్‌, ఐడియాలు కూడా తమ ప్లాన్లను..

కాగా అప్‌డేట్‌ చేసిన ఈ ప్లాన్లు జియో ప్లాన్లకు తీవ్ర పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. అదేవిధంగా వొడాఫోన్‌, ఐడియాలు కూడా తమ ప్లాన్లను అప్‌డేట్‌ చేయాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Rs. 349 Plan Now Offers 2GB Data Per Day, Rs. 549 Recharge Provides 3GB Daily
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot