Airtel ప్లాన్లలో మార్పులు, జియో రూ.399, రూ.149కి గట్టి పోటీ
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ జియోకి గట్టిపోటినిస్తూ తన ప్లాన్లలో మార్పులను చేసింది. జియో రూ.399కి పోటీగా తన పాత ప్లాన్ రూ.399లో మార్పులు చేసింది.
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ జియోకి గట్టిపోటినిస్తూ తన ప్లాన్లలో మార్పులను చేసింది. జియో రూ.399కి పోటీగా తన పాత ప్లాన్ రూ.399లో మార్పులు చేసింది. దీంతో పాటు రూ. 149లో కూడా మార్పులు చేసింది. ఈ మార్పులు ద్వారా వినియోగదారులు అదనపు డేటాను ఎక్కువరోజులు పొందుతారని కంపెనీ తెలిపింది. దీంతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ , ఎసెమ్మెస్ లాంటి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. Airtel revised చేసిన ప్లాన్లపై ఓ లుక్కేయండి.

రూ. 399 ప్లాన్
ఇంతకు ముందు దీని వ్యాలిడిటీ 70 రోజుల వ్యాలిడిటీతో ఉంది. కాగా దీన్ని ఇప్పుడు 84 రోజుల వరకు వ్యాలిడిటీని ఇచ్చింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 84 రోజుల పాటు రోజుకు 1జిబి 3జి/4జి డేటాను పొందుతారు. అలాగే అపరిమిత లోకల్ , నేషనల్ కాల్స్ లభిస్తాయి. డైలీ 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి.

జియోకి గట్టి పోటీ
ఈ ప్లాన్ ఇప్పుడు జియోకి గట్టి పోటీనివ్వనుంది.జియో రూ.399 ప్లాన్ కూడా ఇదే రకమైన బెనిఫిట్స్ ని అందిస్తోంది. దీని వ్యాలిడిటీ మొత్తం 84 రోజులుగా ఉంది. అలాగే అపరిమిత లోకల్ , నేషనల్ కాల్స్ లభిస్తాయి.

రూ. 149 ప్లాన్
కాగా Airtel తన రూ. 149 ప్లాన్ లో కూడా మార్పులను చేర్పులను చేసింది. ఈ ప్లాన్లో యూజర్లు 28 రోజులు పాటు రోజుకు 1జిబి డేటా చొప్పున పొందుతారు. అలాగే అపరిమిత లోకల్ , నేషనల్ కాల్స్ లభిస్తాయి. డైలీ 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి.

ఎంపిక చేసిన ఏరియాల్లోనే..
అయితే ఈ ప్లాన్లు కేవలం ఎంపిక చేసిన ఏరియాల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో ఈ ప్లాన్ యూజర్లకి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్లాన్ కూడా జియో రూ.149కి గట్టిపోటీనిచ్చేందుకు రెడీ అయింది.

చాపకింద నీరులా ..
ఇప్పటికే ఈ రెండు టెలికాం దిగ్గజాల మధ్య టారిఫ్ పోరు తారాస్థాయికి చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండింటి మధ్య వార్ ఇలా ఉంటే మిగతా టెల్కోలు అయిన వొడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు చాపకింద నీరులా తమ ప్లాన్లను విస్తరిస్తూ ఈ రెండు దిగ్గజాలకు సవాల్ విసిరుతున్నాయి.


Click it and Unblock the Notifications








