Home
News

జియోకి మరో షాక్ : Airtel 70 రోజుల నయా ప్లాన్ !

టెల్కోలకు షాకుల మీద షాకులు ఇస్తూ దూసుకుపోతున్న జియోకి Airtel సరికొత్త షాక్ ఇచ్చింది. నయా ఆఫర్లతో జియోను బలంగానే ఢీకొంటోంది.

By Hazarath

టెల్కోలకు షాకుల మీద షాకులు ఇస్తూ దూసుకుపోతున్న జియోకి Airtel సరికొత్త షాక్ ఇచ్చింది. నయా ఆఫర్లతో జియోను బలంగానే ఢీకొంటోంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

రూ.448తో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌

రూ.448తో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌

Airtel ఇప్పుడు సరికొత్తగా రూ.448తో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ఆవిష్కరించింది. రిలయన్స్‌ జియో పాపులర్‌ రూ.399 ప్లాన్‌కు కౌంటర్‌గా ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

రోజు 1జీబీ డేటా

రోజు 1జీబీ డేటా

ఈ ప్లాన్‌ కింద వాయిస్‌ కాల్స్‌ను‌, రోజు 1జీబీ డేటాను 70 రోజుల పాటు అందించనుంది. అంటే 70 రోజులకు మొత్తం 70జీబీ డేటా ఉచితంగా లభిస్తోంది.

వాయిస్‌ కాల్స్‌లో పరిమితి

వాయిస్‌ కాల్స్‌లో పరిమితి

అయితే వాయిస్‌ కాల్స్‌లో ఎయిర్‌టెల్‌ పరిమితి విధించింది. రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 కాల్స్‌ వాడుకునేలా ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

రోజుకు 200 నిమిషాలను వాడుకున్నట్టయితే..

రోజుకు 200 నిమిషాలను వాడుకున్నట్టయితే..

కస్టమర్‌ రోజుకు 200 నిమిషాలను వాడుకున్నట్టయితే మొదటి 5 రోజుల తరువాత ఉచిత టాక్‌టైం లభిస్తోంది. ఒకవేళ పరిమితికి మించి టాక్‌ టైమ్‌ను వాడుకుంటే నిమిషానికి 30 పైసల ఛార్జీలు విధించనున్నట్టు ఎయిర్‌టెల్‌ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు.

100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు

100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు

ఇక ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ ద్వారా యూజర్లకు ఉచిత రోమింగ్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Airtel's Rs. 448 Prepaid Plan: 250 Minutes Talk Time, 1GB Data Daily For 70 Days more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X