Just In
- 1 hr ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 4 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 6 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 7 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- Lifestyle
మీ రాశిని బట్టి ఏ రత్నం ధరిస్తే.. శుభఫలితాలొస్తాయంటే...!
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్
- News
ప్లెక్సీ రగడ.. కనిపించని మోడీ, బీజేపీ శ్రేణుల ఆగ్రహాం, కేసీఆర్ ఫోటో చించివేత
- Finance
Budget 2021-22: స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాల ధరలు పెరుగుతాయా?
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- Movies
అభిజిత్ ఎవరు?.. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కామెంట్స్ వైరల్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జియో రూ.448 ప్లాన్‌కి కౌంటర్ వేసిన ఎయిర్‌టెల్,సునీల్ మిట్టల్ జీవితంలో చీకటి కోణాలు !
టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ రిలయన్స్ జియోకు కౌంటర్ గా మార్కెట్లోకి సరికొత్త ప్లాన్ ని లాంచ్ చేసింది. జియో 448 రూపాయల రీచార్జ్ ప్లాన్‌కు ధీటుగా రూ.449 ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను దేశవ్యాప్తంగా తన కస‍్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటా చొప్పున 70 రోజుల పాటు వాడుకోవచ్చు. అంటే మొత్తం 140 జీబీ డేటాను అందిస్తోంది. దీనితోపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జియోలో ఇదే తరహాలో రూ.448 ప్లాన్ అందుబాటులో ఉండగా ఆ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా వస్తుంది. మొత్తం 84 రోజుల వాలిడిటీకి 168 జీబీ డేటా లభిస్తుంది. తాజాగా ఈ ప్లాన్‌కు పోటీగానే ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
300 మిల్లియన్ రిజిస్ట్రర్ యూజర్ల డేటా లీక్, Paytm స్పందన ఇదే !
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న భారతి ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్ తన జీవితంలో అలాగే వ్యాపార ప్రయాణంలో అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కున్నారు. రూ. 5 వేల కోసం అభ్యర్థించే రోజుల నుంచి కోట్లకు పడగలెత్తిన ఆయన ప్రస్థానాన్ని ఓ సారి పరిశీలిస్తే..

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు..
ఒకానొక సమయంలో తన వద్ద డబ్బే ఉండేది కాదంటూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోజుల్నిఓ సంధర్భంలో మిట్టల్ గుర్తుచేసుకున్నారు.రూ.5000 కోసం అభ్యర్థించే దీన స్థితిలోకి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.

రూ.5000 కోసం
రూ.5000 కోసం తన అంకుల్ బ్రిజ్‌మోహన్ లాల్ ముంజల్ ను ఆశ్రయించానని, అంకుల్ నాకు రూ.5000 కావాలని కోరానని, ఆయన తన ఇన్‌వాయిస్‌లు తీసుకుని, అవసరమైన మొత్తాన్ని ఇచ్చారని మిట్టల్ ఓ ఇంటర్యూలో తెలిపారు.

ఇదే అలవాటుగా మార్చుకోకు..
ఆ డబ్బులు ఇస్తూ ఆయన అన్న మాటలు ఇప్పుటికి నా చెవుల్లో రింగవుతున్నాయని తెలిపారు. వెళ్లి పోయే సమయంలో తనని ఆపిన బ్రిజ్‌మోహన్...ఇదే అలవాటుగా మార్చుకోకు అంటూ గట్టి సలహా ఇచ్చారని, ఈ మాటలు తన హృదయాన్ని తాకాయని తెలిపారు.

ఆఫ్రికాలో అడుగుపెట్టి..
తన వ్యాపార ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కుని ఇలా మీ ముందు ఉన్నానని చెబుతూ ఆఫ్రికాలో అడుగుపెట్టి పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

వ్యాపారాన్ని దారిలో పెట్టేందుకు..
ఆఫ్రికాలో అడుగుపెట్టాలన్నది కొంత తొందరపాటు నిర్ణయమేననీ, దీనివల్ల వ్యాపారాన్ని దారిలో పెట్టేందుకు కొన్ని సంవత్సరాల పాటు తాను భారీ స్థాయిలో నిధులను తన వ్యక్తిగత సమయాన్నీ ఖర్చుచేయాల్సి వచ్చిందని సునిల్ మిట్టల్ చెప్పారు.

తప్పు చేయడం మానవ సహజం
తప్పు చేయడం మానవ సహజం. అందరూ చేస్తూనే ఉంటారు. వెనుదిరిగి చూసుకుంటే, అప్పుడలా చేసి ఉండాల్సి కాదు.. మరింత ఆలోచించి ఉంటే బాగుండేది.. అనిపించే సందర్భాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి'' అని మిట్టల్ చెప్పారు.

రూ.7000 కోట్లను విరాళంగా ..
కాగా సునీల్ మిట్టల్ ఇటీవలే రూ.7000 కోట్లను విరాళంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. సైకిల్ విడిభాగాల వ్యాపారాలకు ఓనర్‌గా ఉండే సునిల్ మిట్టల్, ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌తో టెలికమ్యూనికేషన్ ప్రపంచాన్నే మార్చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

రూ. 7 వేల కోట్లతో పాటు
రూ. 7 వేల కోట్లతో పాటు విరాళంగా వచ్చిన సొమ్ముతో సత్యభారతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి పేదలు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన యువ ప్రతిభావంతులకు ఉచిత విద్య అందించనున్నట్టు ఆయన తెలిపారు.

సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను..
ఈ విశ్వ విద్యాలయంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను ఉచితంగా నేర్పించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారిస్తారు.

2021 నాటికి రెడీ..
కాగా ఉత్తర భారతదేశంలో అందుబాటులోకి రానున్న ఈ యూనివర్సిటీ 2021 నాటికి రెడీ అవుతుంది. పదివేల మందితో అదే ఏడాది తొలి అకడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుందని సునీల్ మిట్టల్ వివరించారు.

సత్యభారతి యూనివర్సిటీ ఏర్పాటుకు..
అయితే సత్యభారతి యూనివర్సిటీ ఏర్పాటుకు తొలి దశలో రూ.1000 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పిన మిట్టల్ పేద విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. సీట్లు మిగిలితే నామమాత్రపు రుసుముతో ఇంకొందరిని తీసుకుంటామన్నారు.

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు
యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి కోసం పంజాబ్, హరియాణా సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్టు మిట్టల్ తెలిపారు. ఇప్పటికే నందన్ నీలేకని కుటుంబం తమ సంపదలో 50 శాతం వాటాను విరాళానికి ప్రకటించిన సంగతి తెలిసిందే
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190