Airtel రద్దు చేసిన ఆ ప్లాన్ మళ్లీ లైవ్‌లోకి..
దేశీయ టెలికాం రంగంలో టారిప్ వార్ రోజురోజుకు వేడెక్కుతోంది. ఇందులో భాగంగా దిగ్గజాలన్నీ పోటీపడుతూ ఆఫర్లను తెరమీదకు తెస్తున్నాయి.
దేశీయ టెలికాం రంగంలో టారిప్ వార్ రోజురోజుకు వేడెక్కుతోంది. ఇందులో భాగంగా దిగ్గజాలన్నీ పోటీపడుతూ ఆఫర్లను తెరమీదకు తెస్తున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మధ్య డేటా వార్ పతాక స్థాయికి చేరింది. ఇందులో భాగంగానే టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అంతకముందు రద్దు చేసిన 649 రూపాయల పోస్టు పెయిడ్‌ప్లాన్‌ను మళ్లీ ఆవిష్కరించింది. మైప్లాన్ ఇన్ఫినిటీ కింద 'బెస్ట్ సెల్లింగ్ పోస్టుపెయిడ్ ప్లాన్స్'లో భాగంగా ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ కింద ప్రస్తుతం 50జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌ను ఆఫర్ చేయనున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. అయితే అంతకుముందు ఈ ప్లాన్ కింద కేవలం కస్టమర్లకు 30జీబీ 3జీ, 4జీ డేటాను మాత్రమే ఆఫర్ చేసేది. ప్రస్తుతం అదనంగా 20జీబీ డేటాను పెంచేసింది. రిలయన్స్ జియో రూ.509, రూ.799 పోస్టు పెయిడ్ ప్లాన్లకు పోటీగా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

కొత్త రూ.649 ప్లాన్ కింద నెలకు 50జీబీ డేటా మాత్రమే కాక, అపరిమిత వాయిస్ కాల్స్, రోమింగ్‌లో అవుట్‌గోయింగ్ కాల్స్ ఉచితంగా అందించనుంది.ఇందులో ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితి లేదు. కాగా ఈ పోస్టుపెయిడ్ ప్లాన్ డేటా రోల్ ఓవర్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. అంటే నెలలో సద్వినియోగం చేసుకోని డేటాను, తర్వాతి నెలకు పంపించుకునే అవకాశముంటుంది. ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఈ ప్లాన్లో భాగంగా యూజర్లకు అమెజాన్ ప్రైమ్‌కు ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీంతో పాటు వింక్ టీవీ సబ్‌స్క్రిప్షన్, లైవ్‌టీవీ, మూవీలు, హ్యాండ్‌సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను ఆఫర్ చేస్తోంది. కాగా ఎయిర్‌టెల్ ఇటీవలే 499 రూపాయలతో కొత్తగా ఓ పోస్టు పెయిడ్ ప్లాన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ ఇన్‌కమింగ్/అవుట్‌గోయింట్ కాల్స్ ఉచితం, 40జీబీ 3జీ,4జీ డేటాను అందిస్తోంది. ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications