రోజంతా అపరిమితంగా మాట్లాడేయండి, డేటాను వాడేయండి, కేవలం రూ.9కే !

By Hazarath

    దేశీయ టెలికాం రంగంలో వార్ ఇప్పట్లో తగ్గేలా లేదు. ముఖ్యంగా జియో ఎయిర్‌టెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జియో ఏ ఆఫర్ తెచ్చినా దానికన్నా తక్కువ ధరకే ఎయిర్‌టెల్‌ తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే జియోని సవాల్ చేస్తూ మరో రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదే ఎంట్రీ-లెవల్‌ 9 రూపాయల రీఛార్జ్‌ ప్యాక్‌. ఈ కొత్త స్కీమ్‌ కింద అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను, డేటాను, ఎస్‌ఎంఎస్‌లను వినియోగదారులకు అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

    దుమ్మురేపిన BSNL, ఏడాది పాటు 1 జిబి డేటా, అపరిమిత కాల్స్

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    రూ.9 ఆఫర్‌‌..

    ఎయిర్‌టెల్‌ రూ.9 ఆఫర్‌‌లో అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌తో పాటు అదనంగా రోజులో 100 ఎస్‌ఎంఎస్‌లను, 100 ఎంబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. కాగా ఇది ఒకరోజు వ్యాలిడిటీతో వచ్చింది. రిలయన్స్‌ జియో రూ.19 ప్లాన్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్‌ ఈ రూ.9 రీఛార్జ్‌ ప్యాక్‌ను తీసుకొచ్చింది.

    జియో రూ.19 ప్లాన్‌లో

    జియో ఆఫర్‌ చేస్తున్న రూ.19 ప్లాన్‌లో అపరిమిత కాల్స్‌, 20 ఎస్‌ఎంఎస్‌లు, 150ఎంబీ డేటాను మాత్రమే వినియోగదారులు పొందుతున్నారు. ధర పరంగా, ఆఫర్ల పరంగా చూసుకుంటే జియో కంటే ఎయిర్‌టెలే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది.

    రూ.23 plan

    రూ.23తో ఎయిర్‌టెల్‌ మరో ప్లాన్‌ను కూడా ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 200 ఎంబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లను వినియోగదారులు పొందుతారు. కాగా ఇది రెండు రోజుల వరకు యూజర్లు వాడుకోవచ్చు.

    యాక్టివేట్ ఎలా..?

    ఈ ప్లాన్లు కంపెనీ మొబైల్‌ అప్లికేషన్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా కస్టమర్లు యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కోంబో ఆఫర్‌ సెక్షన్‌ కింద ఈ రీఛార్జ్‌ ప్యాక్‌ అందుబాటులో ఉంది.

    రూ.98 ప్యాక్‌

    ఇదిలా ఉంటే నెల రోజుల పాటు ఇలాంటి ప్రయోజనాలు పొందాలనుకునే వారికి కూడా ఎయిర్‌టెల్‌ రూ.98 ప్యాక్‌ను ఇటీవల లాంచ్‌ చేసింది. దీని కింద అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోమింగ్‌పై ఉచిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1జీబీ 4జీ లేదా 3జీ డేటాను కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ 28 రోజుల పాటు అందిస్తోంది.

    ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ బెస్ట్ అనే దానికి కారణాలు !

    ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ ప్లాన్లను రివిజన్ చేసింది. Rs. 399, Rs. 499, Rs. 799, and Rs. 1,199 ప్లాన్లను రివిజన్ చేసి అధిక డేటా ఆఫర్ ని అందిస్తోంది. నెల రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్లో యూజర్లకు డబుల్ డేటా బెనిఫిట్లు అందుతాయి. ఇందులో ముఖ్యంగా Rs. 499 ప్లాన్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.

    Double data benefit

    ఈప్లాన్లో భాగంగా 40GB of 3G/4G dataను యూజర్లకు అందిస్తోంది. దీంతో పాటు unlimited local, STD and roaming callsను అందిస్తోంది. రోమింగ్ సమయంలో మీరు incoming and outgoing calls చేసుకోవచ్చు. ఇంతకు ముందు 20GB of 3G/4G లభించేది.

    Data Rollover feature

    ఈ ప్లాన్లో మీరు ఈ నెలలో డేటా వాడకం ఏదైనా మిగిలి ఉంటే అది వచ్చే నెలకు యాడ్ అవుతుంది. ఇలా 200 జిబి వరకు మీకు వచ్చే నెలకు వాడని డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు MyAirtel app ద్వారా రిమెయినింగ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.

    Other benefits

    దీంతో పాటు ఈ ప్లాన్లో మీకు ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. Wynk Music, Live TV & Movies, and handset damage protection లాంటివి ఉచితంగా మీకు అందుతాయి.దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఏడాది పాటు ఉచితంగా పొందే అవకాశాన్ని ఈ ప్లాన్ కల్పిస్తోంది. దీని ధర రూ. 999. అయితే ఇది పూర్తిగా ఉచితం.

    Watch Amazon Prime for free with Airtel TV

    ఏడాది పాటు ఉచిత ప్రైమ్ మెంబర్ షిప్ మీకు అమెజాన్ నుంచి కావాలంటే మీరు ముందుగా Airtel TV app యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు Amazon Prime app డౌన్లోడ్ చేసుకోవాలి. దీని ద్వారా మీరు ఏడాది పాటు అన్ లిమిటెడ్ సినిమాలు ,అలాగే టీవీషోలు ఉచితంగా వీక్షించవచ్చు.

     

    Should you opt for this plan?

    పైన చెప్పినవన్నీ మీకు కేవలం రూ. 499 చెల్లించడం ద్వారా లభిస్తాయి. 40GB of data, free and unlimited calls, handset protection, and music, movies and live TV shows ఇవన్నీ మీకు రూ. 4999కే లభిస్తున్నాయంటే నిస్సందేహంగా ప్లాన్ మంచిదేనని చెప్పవచ్చు. కాగా దేశీయ టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ టాప్ లో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. టెలికాం రంగమే కాకుండా high speed home broadband, DTH, enterprise services లాంటి ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది.

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    English summary
    Airtel Rs. 9 Recharge Offers Unlimited Local, STD, and Roaming Calls for 1 Day More News at Gizbot Telugu
    Opinion Poll
    X

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more