రూ.9కే అపరిమిత కాల్స్, Airtel, వొడాఫోన్ సంచలనం
దేశీయ టెలికాంరంగంలో జియో ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ప్రత్యర్థి కంపెనీలు ఎయిర్‌టెల్, ఐడియా లాంటి కంపెనీలు ఆకర్షణీయమైన ప్లాన్లతో ముందుకు వస్తున్నాయి.
దేశీయ టెలికాంరంగంలో జియో ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ప్రత్యర్థి కంపెనీలు ఎయిర్‌టెల్, ఐడియా లాంటి కంపెనీలు ఆకర్షణీయమైన ప్లాన్లతో ముందుకు వస్తున్నాయి. అత్యంత తక్కువ ధరలో ఒకరోజు, రెండు రోజుల వ్యాలిడిటీలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ రూ.9కే అపరిమిత కాల్స్ అందిచేందుకు రెడీ అయ్యాయి. కాగా జియోలో ఈ ప్లాన్ ధర రూ. 19గా ఉంది. ప్లాన్ పూర్తి వివరాల్లోకెళితే..

వొడాఫోన్
వొడాఫోన్ చందాదారులు రోజుకు అపరిమిత స్థానిక , ఎస్టీడీ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు, 100ఎంబీ డేటానుపొందవచ్చు. అయితే కొత్త ప్యాక్ ప్రత్యేకంగా యుపి ఈస్ట్ లో వోడాఫోన్ చందాదారుల కోసం ఈప్లాన్‌ను తీసుకొచ్చింది. త్వరలో దేశ వ్యాప్తంగా తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఎయిర్టెల్
9 రూపాయల ప్యాక్‌లో ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా రోజుకు అన్‌లిమిటెడ్ కాలింగ్ 100ఎస్‌ఎంఎస్‌లు, 100ఎంబీ డేటాను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 1 రోజు మాత్రమే..

జియో
జియో రూ. 19 రోజువారీ ప్యాక్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, 20 సందేశాలతోపాటు 150 ఎంబీ డేటాను ఆఫర చేస్తోంది. దీని వ్యాలిడిటీ 1 రోజు మాత్రమే..

మళ్లీ అదిరే డిస్కౌంట్లతో దూసుకొచ్చిన జియో
తన ప్రీపెయిడ్ ఖాతాదారులకు రిలయన్స్ జియో గుడ్‌న్యూస్ చెప్పింది. తన పాపులర్ ప్రీ పెయిడ్ ప్లాన్‌పై డిస్కౌంట్‌ను ప్రకటించింది.మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications