Home
News

మీరు అధికంగా డేటా వినియోగిస్తుంటారా.. ఏకంగా 900GB డేటాతో రీఛార్జ్ ప్లాన్‌!

ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ ఎయిర్‌టెల్‌ (Airtel) యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అధిక డేటా వినియోగించుకొనే వారి కోసం ప్రత్యేక ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చింది. డేటాతోపాటు కాలింగ్‌, SMS ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇటీవలే ఎయిర్‌టెల్ రూ.399, రూ.499 రీఛార్జ్‌ ప్లాన్‌ ను కూడా తీసుకొచ్చింది.

ఎయిర్‌టెల్ రూ.1099 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఎయిర్‌టెల్ రూ.1099 రీఛార్జ్‌ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా విషయానికి వస్తే ఈ ప్లాన్‌ లో ప్రతి 28 రోజులకు 300GB డేటాను పొందవ‌చ్చు.

airtel Rs1099 rechrage plan

ఈ ప్లాన్ (Airtel Rs1099 Recharge Plan) వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌ లో మొత్తంగా 900GB డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు హలోట్యూన్స్‌ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. అడోబ్‌ ఎక్స్‌ఫ్రెస్‌ ప్రీమియం ను (Adobe Express Premium) కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

అడోబ్‌ ఎక్స్‌ఫ్రెస్‌ ప్రీమియం ధర సంవత్సరానికి రూ.4000 గా ఉంది. అయితే ఎయిర్‌టెల్‌ యూజర్లు సంవత్సరం వరకు ఆడోబ్‌ సాఫ్ట్‌వేర్‌ ను ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.399 రీఛార్జ్‌ ప్లాన్ :
ఎయిర్‌టెల్‌ ఇటీవల రూ.399, రూ.449 రీఛార్జ్‌ ప్లాన్‌ లను తీసుకొచ్చింది. రూ.399 ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్, STD కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా మొత్తంగా 300GB డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ (Airtel Rs399 Recharge Plan) వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌ లో భాగంగా ఉచిత హలోట్యూన్స్‌తోపాటు అడోబ్‌ ఎక్స్‌ఫ్రెస్‌ ప్రీమియం ను కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు.

ఎయిర్‌టెల్‌ రూ.449 రీఛార్జ్‌ ప్లాన్ :
అదే రూ.449 రీఛార్జ్‌ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రోజువారీ 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా మొత్తంగా 300GB డేటాను వినియోగించుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్‌ లో (Airtel Rs449 Recharge Plan) భాగంగా గూగుల్‌ వన్‌ స్టోరేజీ, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌, జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఆపిల్‌ మ్యూజిక్‌, హలో ట్యూన్స్‌ ను ఉచితంగా పొందవచ్చు. దీంతోపాటు అడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్ సహా థ్యాంక్స్‌ యాప్‌ లో మాత్రం ప్రస్తుతానికి ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లు అందుబాటులోకి రాలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
airtel Rs1099 rechrage plan launched with 900GB Data with 84 days validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X