Home
News

84 రోజుల వ్యాలిడిటీ, 210GB డేటాతో ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. పూర్తి వివరాలు..!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel) ప్రస్తుతం దేశంలో రెండో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌ గా ఉంది. భారీ సంఖ్యలో ఉన్న తన యూజర్ల కాలింగ్, డేటా, SMS, OTT అవసరాలకు అనుగుణంగా అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ లను కలిగి ఉంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ నెలవారీ రీఛార్జీ ప్లాన్‌ ల నుంచి వార్షిక ప్లాన్‌ల వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రతినెల రీఛార్జ్‌ చేసుకొనేందుకు అవకాశం లేని మరియు ప్రతినెల రీఛార్జ్‌లు చేసుకొనేందుకు ఆసక్తి చూపని యూజర్ల కోసం తాజాగా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ను కలిగి ఉంది.

ఎయిర్‌టెల్‌ రూ.1,199 రీఛార్జ్‌ ప్లాన్‌ (Airtel RS1199 Prepaid Recharge Plan) ద్వారా 84 రోజుల వ్యాలిడిటీతో అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2.5GB డేటాను అందిస్తోంది.

Airtel RS1199 Prepaid Recharge plan

210GB డేటాను పొందవచ్చు :
మొత్తంగా ఈ ప్లాన్‌ లో భాగంగా 210GB డేటాను పొందవచ్చు. హైస్పీడ్‌ డేటా అనంతరం 64kbps వేగంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు హలోట్యూన్స్‌ ను కూడా పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ RS409 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్ (Airtel RS409 Recharge Plan) ద్వారా ప్రతిరోజు 2.5GB డేటాను పొందవచ్చు. 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

దీంతోపాటు ఈ రీఛార్జ్‌ ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌ xStream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఇందులో భాగంగe సోనీలివ్‌, ఆహా సహా 22 ఓటీటీలను వినియోగించుకోవచ్చు. మరియు ఉచితంగా హలోట్యూన్స్‌ను వినియోగించుకోవచ్చు. దీంతో స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌ల నుంచి రక్షణను పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ రూ.425 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా రోజువారీ 2.5GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ నెల రోజులుగా ఉంది. దీంతోపాటు 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ సంవత్సరం జులై తొలివారంలో ప్రైవేటు టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్ ఐడియా.. రీఛార్జ్‌ ధరలను పెంచాయి. దీంతో ఆయా సంస్థలకు యూజర్లు గట్టిషాక్‌ ఇస్తున్నారు. వరుసగా జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఆయా సంస్థలకు భారీ సంఖ్యలో యూజర్లు గుడ్‌బై చెప్పారు. ఈ వివరాలను టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) వెల్లడించింది.

జులై నెలలో ఎయిర్‌టెల్‌ 14.3 లక్షల యూజర్లను కోల్పోయింది. జులై, ఆగస్టులోనూ భారీ సంఖ్యలో యూజర్లు ఇతర నెట్‌వర్క్‌ లకు పోర్టింగ్‌ అయ్యారు. అయితే ఈ మూడు నెలల్లోనూ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్ లిమిటెడ్‌) భారీ స్థాయిలో యూజర్లను సంపాదించుకుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel RS1199 Prepaid Recharge plan offers 2.5GB daily data with 84 days validity full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X