ఎయిర్‌టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. ప్రతిరోజు 3GB 4G, అన్‌లిమిటెడ్ 5G డేటా సహా OTT సబ్‌స్క్రిప్షన్!
ఎయిర్‌టెల్ ప్రస్తుతం భారత్ టెలికాం రంగంలో యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉంది. ఒకటో స్థానంలో జియో, మూడో స్థానంలో వోడాఫోన్ ఐడియా ఉన్నాయి. చివరి స్థానంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఉన్నాయి. ఇటీవల కాలంలో యూజర్లను ఆకట్టుకొనేందుకు టెలికాం సంస్థలు అనేక రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉన్నాయి. గత సంవత్సరం మొబైల్ టారిఫ్ ధరలు పెంచిన అనంతరం ఇతర నెట్‌వర్క్ లకు పోర్టింగ్ అవుతున్నారు.
వినియోగదారులను కాపాడుకొనేందుకు అన్ని సంస్థలు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎయిర్‌టెల్ (Airtel) ప్రస్తుతం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. యూజర్ల కాలింగ్, డేటా, SMS, OTT అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉంది.

ప్రస్తుతం డేటా, OTT ప్రయోజనాలతో ఎయిర్‌టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉంది. రూ.1798 ప్లాన్‌లో (Airtel Rs1798 Prepaid Recharge Plan) భాగంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిడెట్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. వీటితోపాటు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 3GB డేటాను వినియోగించుకోవచ్చు.
వీటితోపాటు ఓటీటీ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. మూడు నెలలపాటు నెట్‌ఫ్లిక్స్ (Netflix) బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా ఫ్రీ హాలో ట్యూన్స్‌తోపాటు అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అధిక డేటా, OTT రెండు ప్రయోజనాలు కావాలని భావిస్తున్న యూజర్‌లకు ఈ రూ.1798 రీఛార్జ్ ప్లాన్ ఉపయోగపడుతుంది.
తక్కువ ధరలో ఓటీటీ ప్రయోజనాలతో రీఛార్జ్ ప్లాన్ కావాలని కోరుకొనే వారి కోసం రూ.398 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (Airtel Rs398 Prepaid Recharge Plan) అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు ప్రతి రోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. మరియు డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. దీంతోపాటు ఉచితంగా హాలో ట్యూన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
ఎయిర్‌టెల్ రూ.838 రీఛార్జ్ ప్లాన్ లో (Airtel Rs838 Prepaid Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 3GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిడెట్ 5G డేటాను పొందవచ్చు. ఇందుకోసం మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌ను సపోర్టు చేయాల్సి ఉంటుంది.
ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్ Xstream ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. మరియు ఉచితంగా హాలోట్యూ్న్స్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది.
ఎయిర్‌టెల్ రూ.1029 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 5G నెట్‌వర్క్ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G సదుపాయాన్ని పొందవచ్చు.
ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజులపాటు డిస్ని + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఎయిర్‌టెల్ Xstream ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు ఉచితంగా హాలో ట్యూ్న్స్‌ను వినియోగించుకోవచ్చు. అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్ర్కిప్షన్‌ను కూడా పొందవచ్చు.


Click it and Unblock the Notifications








