Home
News

కేవలం కాలింగ్ కోసమే ఫోన్‌ వాడుతున్నారా.. సంవత్సరానికి ఒకటే రీఛార్జ్‌ ప్లాన్‌..!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ నెల రోజుల వ్యాలిడిటీ నుంచి 365 రోజుల వ్యాలిడిటీ వరకు అనేక ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. యూజర్ల కాలింగ్‌, డేటా, OTT అవసరాలకు అనుగుణంగా అనేక ప్లాన్‌లు ఉన్నాయి. దీంతోపాటు కాలింగ్ లేదా డేటా కూడా ప్రత్యేక ప్లాన్‌లు ఉన్నాయి. భారీ వ్యాలిడిటీతో కాలింగ్‌ కోసమే ప్లాన్‌లు చూస్తున్నట్లయితే ఈ రెండు ప్లాన్‌లు యూజర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది.

రూ.1,849 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లో భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు 3600 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటాను అందించడం లేదు.

airtel Rs1849 plan

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. మరియు ఉచితంగా హాలోట్యూన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. కేవలం కాలింగ్ కోసమే ఫోన్‌ ఉపయోగిస్తున్న యూజర్లకు ఈ రీఛార్జ్ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

నెలవారీ (Airtel Rs1849 Recharge Plan) రీఛార్జ్ చేయడానికి బదులుగా సంవత్సరానికి ఈ ఒక్క రీఛార్జ్‌తో డేటా మినహా ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.

రూ.2,249 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లో (Airtel Rs2249 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 3600 SMS లను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో మొత్తంగా 30GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. దీంతోపాటు హాలోట్యూన్స్‌ను ఉచితంగా పొందవచ్చు. దీంతోపాటు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

కాలింగ్‌తోపాటు చిన్న చిన్న డేటా అవసరాలు ఉన్న యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. నెలవారీ రీఛార్జ్ చేసేందుకు ఆసక్తిలేని యూజర్లకు ఈ సంవత్సరం వ్యాలిడిటీ అందించే ప్లాన్‌ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

రూ.3599 రీఛార్జ్ ప్లాన్ :
సంవత్సరం వ్యాలిడిటీతో కాలింగ్‌, డేటా రెండు అవసరం అయిన యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాల్స్‌ పొందుతారు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. దీంతోపాటు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ, హాలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

రూ.3999 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటాపరంగా ప్రతిరోజు 2.5GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది.

ఈ ప్లాన్‌లో సంవత్సరం వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. దీంతోపాటు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ, హలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Rs1849 and Rs2249 Prepaid Recharge plans offers unlimited calling with 365 Days validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X