రూ.1849 రీఛార్జ్‌తో సంవత్సరం వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా..!
Airtel Yearly Recharge Plans : ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ప్రస్తుతం అనేక రీఛార్జ్ ప్లాన్లను కలిగి ఉంది. నెలవారీ, 56 రోజులు, 72 రోజులు, 84 రోజుల వ్యాలిడిటీతోపాటు సంవత్సరం వ్యాలిడిటీని అందించే అనేక ప్లాన్లు ఉన్నాయి. ప్రస్తుతం సంవత్సరం వ్యాలిడిటీతో 4 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఈ జాబితాలో రూ.1849, రూ.2249, రూ.3599, రూ.3999 వంటి ప్లాన్‌లు ఉన్నాయి.
* ఎయిర్‌టెల్ రూ.1849 రీఛార్జ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 3600 SMS లను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటాను అందించడం లేదు.

ఈ ప్లాన్‌లో (Airtel Rs1,849 Recharge Plan) పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్‌ను ఉచితంగానే పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.
* రూ.2249 రీఛార్జ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 3600 SMS లతోపాటు 30GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ లో (Airtel Rs2,249 Recharge Plan) సంవత్సరానికి రూ.17 వేల విలువైన పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్‌ను ఉచితంగానే పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.
* రూ.3599 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో (Airtel Rs3,599 Recharge Plan) రోజువారీ 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో యూజర్లు 12 నెలలకు రూ.17 వేల విలువైన పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
* రూ.3999 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో (Airtel Rs3,999 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. వీటితోపాటు సంవత్సరం వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు.
ఈ ప్లాన్‌లో యూజర్లు 12 నెలలకు రూ.17 వేల విలువైన పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








