కాలింగ్, డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌లు... పూర్తి వివరాలు..!
ఎయిర్‌టెల్ ఇటీవల తన నెలవారీ కనీస రీఛార్జ్ ప్లాన్ రూ.189 ను తొలగించింది. యూజర్లు నెలవారీ కనీస ప్లాన్ కావాలంటే కచ్చితంగా రూ.199 ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం తక్కువ ధరలో కాలింగ్, డేటాతోపాటు ఓటీటీ ప్రయోజనాలను అందించే అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది.
* రూ.279 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు మొత్తంగా 1GB డేటాను పొందుతారు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, జియోహాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్, Zee5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ Xstream ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

ఇందులో SonyLIV సహా మరిన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలను ఉపయోగించుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ (Airtel Rs279 Recharge Plan) వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది.
* రూ.398 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను అందిస్తోంది. రోజువారీ 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.
దీంతోపాటు (Airtel Rs398 Recharge Plan) జియోహాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. వీటితోపాటు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. హాలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
* రూ.449 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs449 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ను కూడా అందిస్తోంది. 30GB క్లౌడ్ స్టోరేజీని వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ Xstream ప్లే సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా SonyLIV ను కూడా వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీంతోపాటు ఉచిత హలో ట్యూన్స్, పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.
* రూ.598 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs598 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, STD కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. రోజువారీ 100 SMS లతోపాటు 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.
నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ను కూడా పొందవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్ సూపర్ ప్లాన్, Zee5 సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఉచిత హలో ట్యూన్స్, పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.


Click it and Unblock the Notifications








