Home
News

మూడు బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకొచ్చిన ఎయిర్‌టెల్‌.. డేటా, ఓటీటీ పూర్తి ప్రయోజనాలు..!

Airtel All in One OTT Plans : ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ తన యూజర్ల కోసం తాజాగా మూడు కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ల ద్వారా వివిధ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తోంది. ఇందులో జియోహాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, Zee5 సహా మరిన్ని ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్‌టెల్ వినియోగదారుల సంఖ్య పరంగా రెండో స్థానంలో ఉంది. జియో తొలి స్థానంలో ఉంది.

దేశంలోనే ఆన్ ఇన్‌ వన్‌ ఓటీటీలతో కూడిన రీఛార్జ్‌ ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా 25 కు పైగా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాంలను ఉపయోగించుకోవచ్చు. ఈ మూడు ప్లాన్‌లో ఒకటి డేటా ప్లాన్‌గా ఉంది. మరో రెండు ఓటీటీలతోపాటు కాలింగ్‌ ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి.

Airtel Rs279  Rs598  Rs1729 all in One OTT Recharge Plans launched

ఎయిర్‌టెల్ రూ.279 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs279 Plan) భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌, Zee5 ప్రీమియం, జియోహాట్‌స్టార్‌ సూపర్‌ ప్లాన్‌తోపాటు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు యూజర్లు రోజువారీ 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.

ఎయిర్‌టెల్‌ రూ.589 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌, జియోహాట్‌స్టార్ సూపర్‌, Zee5 ప్రీమియం, ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో (Airtel Rs598 Plan) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది. ఒకే ప్లాన్‌లో కాలింగ్, డేటా, OTT ప్రయోజనాలు కావాలనుకొనే వారికి ఈ ప్లాన్‌ ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ఎయిర్‌టెల్‌ రూ.1729 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు నెట్‌ఫ్లిక్స్ బేసిక్‌ ప్లాన్‌, జియోహాట్‌స్టార్ సూపర్‌, Zee5 ప్రీమియం, Xstream play ప్రీమియం వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు.

దీంతోపాటు ఈ ప్లాన్‌లో (Airtel Rs1729 Plan) భాగంగా రోజువారీ 2G 4G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

ఇటీవలే ఎయిర్‌టెల్ స్పామ్‌ కాల్స్‌ నుంచి యూజర్లను అప్రమత్తం చేస్తోంది. అయితే తాజాగా సైబర్‌ నేరాల నుంచి కూడా రక్షణ కల్పించేందుకు ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌ను లాంచ్‌ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఈ సిస్టమ్ పనిచేస్తుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

ఎయిర్‌టెల్‌ ఫ్రాడ్ డిటెక్షన్‌ సిస్టమ్‌ ఎలా పనిచేస్తుంది?
ఈ ఫ్రాడ్‌ డిటెక్షన్ సిస్టమ్‌.. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌, ఇ-మెయిల్‌, SMS, మొబైల్‌ బ్రౌజర్‌ ద్వారా జరిగే మోసాల నుంచి యూజర్లను కాపాడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో ఈ ప్లాట్‌ఫామ్స్‌కు వచ్చే లింక్స్‌ను తనిఖీ చేస్తుంది. ఈ లింక్స్‌ అనుమానాస్పదంగా ఉంటే, మొబైల్‌లో ఓపెన్‌ కాకుండా చూస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Rs279, Rs598, Rs1729 all in One OTT Recharge Plans launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X