అధిక డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS లతో రీఛార్జ్ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు..!
ఎయిర్‌టెల్ ప్రస్తుతం అనేక డేటా ప్లాన్‌లను కలిగి ఉంది. ఇందులో రోజువారీ ప్లా్‌న్‌ల నుంచి నెల వారీ వరకు అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లు ఉన్నాయి. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS లు సహా భారీ డేటాను అందిస్తోంది. ఇందులో రూ.355, రూ.589, రూ.609 వంటి అనేక ప్లాన్ లు ఉన్నాయి. ఈ ప్లాన్ ల పూర్తి ప్రయోజనాల వివరాలు.
రూ.355 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రూ.5 టాక్‌టైం ను కూడా అందిస్తోంది. మరియు 300 SMS లను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్ లో ( Airtel Rs355 Recharge Plan ) మొత్తంగా 25GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది. వీటితోపాటు ఉచిత హలో ట్యూన్స్, పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
రూ.589 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 50GB డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ (Airtel Rs589 Recharge Plan) వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. దీంతోపాటు ఉచిత హాలోట్యూన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. మరియు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.
రూ.609 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు మొత్తంగా 300 SMS లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 60GB డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ (Airtel Rs609 Recharge Plan) వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంటుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పెప్‌ఫ్లెక్సిటీ ప్రో ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరియు ఉచిత హలోట్యూన్స్‌ను కూడా పొందవచ్చు.
రూ.2249 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 3600 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 30GB డేటాను అందిస్తోంది.
ఈ ప్లాన్ (Airtel Rs2249 Recharge Plan) వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. దీంతోపాటు హలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరియు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
రూ.361 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs361 Recharge Plan) భాగంగా యూజర్లు 50GB డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో డేటా మినహా ఎటువంటి కాలింగ్, SMS లు అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. కేవలం డేటా మాత్రమే కావాల్సిన యూజర్లు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








