Home
News

OTT సబ్‌స్క్రిప్షన్‌, 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయంతో ఎయిర్‌టెల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌..!

ప్రముఖ టెలికాం ప్రొవైడర్‌ ఎయిర్‌టెల్‌ (Airtel) .. యూజర్ల పరంగా భారత్‌ లో రెండో స్థానంలో ఉంది. ఇటీవలే స్పామ్‌ కాల్స్‌, స్పామ్‌ మెసేజ్‌ లను ఆటోమేటిక్‌ గా కట్టడి చేసే విధంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతోపాటు యూజర్ల కాలింగ్‌, డేటా, OTT అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులో ఉంచింది.

కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ : ఈ సంవత్సరం జులై నెలలో ఇతర ప్రైవేటు టెలికాం సంస్థలతోపాటు ఎయిర్‌టెల్‌ కూడా మొబైల్‌ రీఛార్జ్‌ ధరలను పెంచింది. దీంతోపాటు అనేక మంది వినియోగదారులు ఇతర టెలికాం నెట్‌వర్క్‌ లకు పోర్టింగ్‌ అవుతున్నారు. దీంతో వినియోగదారులను ఆకట్టుకొనేందుకు అనేక కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌లను విడుదల చేస్తోంది.

Airtel RS398 prepaid Recharge plan

రూ.398 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ : ఎయిర్‌టెల్‌ తాజాగా రూ.398 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ లో (Airtel RS398 Prepaid Recharge Plan) భాగంగా హాట్‌స్టార్‌ (Hotstar) మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. లైవ్‌ స్పోర్ట్స్‌, మూవీస్‌ సహా ఇతర వెబ్‌సీరిస్‌ లను సులభంగా చూసేందుకు వీలుంది. అయితే కేవలం ఒకరు మాత్రమే వినియోగించుకొనే అవకాశం ఉంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

దీంతోపాటు ఎయిర్‌టెల్ రూ.398 రీఛార్జ్‌ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిడెట్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు డేటా పరంగా రోజువారీ 2GB హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీంతోపాటు అనేక రీఛార్జ్‌ ప్లాన్‌ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్‌ రూ.429 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ లో భాగంగా నెలరోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2.5GB హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రూ.5 టాక్‌టైంను పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G నెట్‌వర్క్‌ ను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు భాగంగా ఉచిత హలోట్యూన్స్‌, అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. మరియు ఎయిర్‌టెల్ Xstream సబ్‌స్క్రిప్షన్‌ ను వినియోగించుకోవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.489 రీఛార్జ్‌ ప్లాన్‌ లో భాగంగా ఏకంగా 84 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం సహా మొత్తంగా 900 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా ఈ ప్లాన్‌ లో భాగంగా మొత్తంగా 6GB డేటాను పొందవచ్చు. ఉచిత హలోట్యూన్స్‌, అపోలో 24/7 సర్కిల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను వినియోగించుకోవచ్చు.

అదే రూ.589 ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌ లో భాగంగా ఏకంగా 50GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా ప్లాన్‌ లో మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌ లో భాగంగా ఉచిత హలోట్యూన్స్‌, అపోలో 24/7 సర్కిల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel RS398 prepaid Recharge plan offers 2GB Daily data and OTT subscription with 28 days validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X