Home
News

రూ. 399 ప్లాన్‌పై రూ. 300 డిస్కౌంట్ పొందడం ఎలా ?

టెలికాం రంగంలో రిలయన్స్ జియోతో నువ్వా నేనా అంటూ దూసుకుపోతున్న Airtel సరికొత్త ప్లాన్ తో ముందుకువచ్చింది.

By Hazarath Aiah

టెలికాం రంగంలో రిలయన్స్ జియోతో నువ్వా నేనా అంటూ దూసుకుపోతున్న Airtel సరికొత్త ప్లాన్ తో ముందుకువచ్చింది. బెస్ట్‌ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్లను ఆఫర్‌ చేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉండే భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పుడు 399 రూపాయలకు సరికొత్త ప్లాన్ ఆఫర్ చేస్తోంది. కాగా వొడాఫోన్‌ రెడ్‌ రేంజ్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ 299 రూపాయల నుంచి ప్రారంభమవుతుంటే, భారతీ ఎయిర్‌టెల్‌ మైప్లాన్‌ ఇన్ఫినిటీ ప్లాన్‌ను 399 రూపాయలకు ఆఫర్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో రూ.399 ప్లాన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

300 రూపాయల డిస్కౌంట్‌..

300 రూపాయల డిస్కౌంట్‌..

399 రూపాయల ప్లాన్‌పై 300 రూపాయల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు పేర్కొంది. 50 రూపాయల చొప్పున ఈ డిస్కౌంట్‌ను ఆరు నెలల పాటు ఆఫర్‌ చేయనుంది. అంటే మొత్తంగా రూ.300 డిస్కౌంట్‌ లభించనుంది.

అదనపు పన్నులతో..

అదనపు పన్నులతో..

దీంతో తర్వాత ఆరు నెలలు రూ.399 ప్లాన్‌ ధర రూ.349కు తగ్గనుంది. అయితే అదనపు పన్నులతో మాత్రం దీని ధర రూ.385గా ఉండనుందని ఎయిర్‌టెల్‌ చెప్పింది.

 నెలకు 20 జీబీ డేటా

నెలకు 20 జీబీ డేటా

ఈ ప్లాన్‌ కింద నెలకు 20 జీబీ డేటా పొందనున్నారు. డేటా క్యారీ ఫార్వర్డ్‌ ఫెసిలిటీని ఎయిర్‌టెల్‌ ఆఫర్‌చేస్తోంది. ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితులు లేకుండా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను ఇది అందిస్తోంది.

రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు

రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు

రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభ్యం కానున్నాయి. అదనంగా ఎయిర్‌టెల్‌ టీవీ, వింక్‌ మ్యూజిక్‌ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌చేస్తుంది. కానీ యూజర్లు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌కు అర్హులు కారు.

ఎయిర్‌టెల్‌ అదనంగా..

ఎయిర్‌టెల్‌ అదనంగా..

వొడాఫోన్‌ మాదిరి ఆఫర్‌ చేసేందుకు ఎయిర్‌టెల్‌ అదనంగా ప్రతి నెల 20 జీబీ డేటాను 12 నెలల పాటు అందిస్తుంది. దీంతో మొత్తంగా ఎయిర్‌టెల్‌ యూజర్లు 40జీబీ డేటా పొందుతారు.

Best Mobiles in India

English summary
Bharti Airtel Makes Rs 399 Postpaid Plan Affordable With Rs 300 Discount Offer for 6 Months more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X