Home
News

ఒకే రీఛార్జ్ ప్లాన్‌పై ఇన్ని ప్రయోజనాలా.. ఈ నెట్‌వర్క్‌ యూజర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

భారత టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. అయితే కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌లు కాలింగ్‌, డేటా, ఓటీటీ ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇందులో రూ.449 రీఛార్జ్ ప్లాన్‌ అనేక ప్రయోజనాలను అందిస్తోంది. దీంతోపాటు రూ.399, రూ.398 వంటి రీఛార్జ్‌ ప్లాన్‌లపైనా ఆకట్టుకొనే ప్రయోజనాలను అందిస్తోంది.

రూ.449 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (AIrtel Rs449 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో భాగంగా రోజువారీ ఏకంగా 4GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు.

Airtel Rs449 and Rs398  Rs399 Recharge Plans

దీంతోపాటు 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. మరియు గూగుల్‌ వన్‌ ద్వారా 30GB క్లౌడ్‌ స్టోరేజీని పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ Xstream ప్లే ప్రీమియం ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇందులో సోనిలివ్‌, ఆహా, SunNXT వంటి అనేక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. దీంతోపాటు ఆపిల్‌ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడీటీ 28 రోజులుగా ఉంటుంది.

రూ.398 రీఛార్జ్ ప్లాన్‌ :
ఎయిర్‌టెల్ యూజర్లు ఈ ప్లాన్‌లో (AIrtel Rs398 Recharge Plan) భాగంగా అన్‌లిమిలెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది. వీటిలో పెర్‌ఫ్లెక్సిటీ ప్రో, ఉచిత హాలోట్యూన్స్‌ను పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.399 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (AIrtel Rs399 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాల్స్‌ సదుపాయం పొందవచ్చు. ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2.5GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G ను కూడా వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 28 రోజులపాటు ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను పూర్తి ఉచితంగా వినియోగించుకోవచ్చు. మరియు హాలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

రూ.598 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs598 Recharge Plans) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. రోజువారీ 2GB డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌, జియోహాట్‌స్టార్‌ సూపర్‌, ZEE5 ప్రీమియం, Xstream ప్లే ప్రీమియం వంటి సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. దీంతోపాటు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. మరియు హాలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel Rs449 and Rs398, Rs399 Recharge Plans with 28 fays validity here are the full Benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X