కాలింగ్ కోసం ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తారా.. ఈ రెండు ప్లాన్‌ల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి..!
Airtel : భారత్ టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉంది. అయితే ఎయిర్‌టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్లాన్ లను కలిగి ఉన్నాయి. డేటా అవసరం తక్కువగా ఉండి, ఎక్కువ కాలింగ్ అవసరాలు ఉన్న యూజర్ల కోసం రెండు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి.
ఎయిర్‌టెల్ రూ.489 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs489 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్ చేసేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు 600 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో భాగంగా మొత్తంగా 6GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 77 రోజులుగా ఉంది.

దీంతోపాటు ఎయిర్‌టెల్ యూజర్లు అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా హలోట్యూన్స్ ను పొందవచ్చు. ఎక్కువగా కాలింగ్ అవసరాలు, డేటా అవసరాలు తక్కువగా ఉన్న యూజర్లు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఏకంగా 77 రోజుల పాటు ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.548 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (Airtel Rs548 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్ లో మొత్తంగా 900 SMS లను ఉపయోగించుకోవచ్చు. డేటా పరంగా మొత్తంగా 7GB డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. మొబైల్ ను ఎక్కువగా కాలింగ్ కోసం ఉపయోగించే వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. 7GB డేటాను యూజర్లు తమకు అవసరం అయిన సమయాల్లో ఉపయోగించుకొనేందుకు వీలుంటుంది.
దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు హలోట్యూన్స్ ను ఉచితంగా పొందవచ్చు. స్పామ్ కాల్స్, స్పామ్ SMS ల పట్ల యూజర్లను అప్రమత్తం చేస్తుంది.
ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ : ఎయిర్‌టెల్ ఇప్పటికే స్పామ్ కాల్స్ నుంచి రక్షణ కల్పిస్తుండగా.. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాల నుంచి యూజర్‌లను అప్రమత్తం చేస్తుంది. ఈ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో పనిచేస్తుంది.
ఇ-మెయిల్, SMS, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, మొబైల్ బ్రౌజర్ ద్వారా జరిగే మోసాల పట్ల ఈ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ అప్రమత్తం చేస్తుంది. AI ద్వారా ఈ ప్లాట్‌ఫామ్స్ కు వచ్చే లింక్స్ ను ఈ సిస్టమ్ చెక్ చేస్తుంది. సైబర్ మోసాలకు సంబంధించిన లింక్స్ అయితే ఓపెన్ అవ్వకుండా ఈ ఫీచర్ బ్లాక్ చేస్తుంది.
ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ హరియానా టెలికాం సర్కిల్ పరిధిలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే మరిన్ని టెలికాం సర్కిల్స్‌కు ఈ ఫీచర్‌ను విస్తరిస్తామని ఎయిర్‌టెల్ తెలిపింది. సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫ్రాడ్ డిటెక్షన్ ఫీచర్ ఉపయోగపడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








