Home
News

మీరు ఎయిర్‌టెల్ వినియోగిస్తున్నారా.. ఈ మూడు రీఛార్జ్‌ ప్లాన్‌ల గురించి మీకు తెలుసా?

Airtel Prepaid Recharge Plans : ప్రముఖ టెలికాం నెట్‌వర్క్‌ ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం దేశంలో యూజర్ల పరంగా రెండో అతి పెద్ద నెట్‌వర్క్‌ గా ఉంది. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌ లను కలిగి ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కాలింగ్‌, డేటా, ఓటీటీ, 5G డేటాతో అనేక ప్లాన్‌లను అందిస్తోంది. అయితే డేటా పరంగానూ అనేక బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ లను కలిగి ఉంది.

ఈ మూడు ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్లు :
రోజువారీ డేటా అందించే ప్లాన్‌లు కాకుండా నెలవారీ ఒకేసారి అధిక డేటాను ( Airtel Data Recharge Plans ) అందించే ప్లాన్‌ లను కూడా కలిగి ఉంది. రూ.609 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్, రూ.589 రీఛార్జ్‌ ప్లాన్‌, రూ.355 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ లు భారీ డేటాను అందిస్తున్నారు. ఈ మూడు రీఛార్చ్‌ ప్లాన్‌ ల ప్రయోజనాల పూర్తి వివరాలు.

airtel Rs589 recharge Plan

* ఎయిర్‌టెల్ రూ.609 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లా్న్‌ లో ( Airtel Rs609 Recharge Plan ) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయం అందిస్తోంది. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ నెల రోజులపాటు ఉంటుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

ఈ ప్లాన్‌ లో భాగంగా 60GB డేటాను పొందవచ్చు. రోజువారీ ఎటువంటి పరిమితి లేకుండా యూజర్లు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ (Perplexity pro AI) ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరియు హాలోట్యూన్స్‌ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

airtel Rs589 recharge Plan

* ఎయిర్‌టెల్ రూ.589 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లా్న్‌ లో ( Airtel Rs589 Recharge Plan ) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయం అందిస్తోంది. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను ఉపయోగిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజుల పాటు ఉంటుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

దీంతోపాటు ఈ ప్లాన్‌ లో 50GB డేటాను వినియోగించుకోవచ్చు. రోజువారీ ఎటువంటి పరిమితి లేకుండా యూజర్లు వినియోగించుకోవచ్చు. వీటితోపాటు అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. హాలోట్యూన్స్‌ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

* ఎయిర్‌టెల్ రూ.355 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా ( Airtel Rs355 Recharge Plan ) అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయం అందిస్తోంది. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను అందిస్తోంది. దీంతోపాటు రూ.5 టాక్‌టైం ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌ లో భాగంగా 25GB డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. దీంతోపాటు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరియు హలోట్యూన్స్‌ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్‌ Xstream యాప్‌ ను ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ ప్రీమియం వెర్షన్‌ను పొందలేరు. కేవలం ఉచితంగా అందిస్తున్న కంటెంట్‌ను మాత్రమే ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
airtel Rs609, Rs589 and Rs355 prepaid recharge plans with huge data and unlimited calling
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X